Guntur Kaaram: మహేష్ బాబుకి ఆ హీరోయిన్ అంటే అంత కోపమా..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో భలే సెట్ అవుతూ ఉంటాయి. వారు ఒక్కసారి జతకడితేనే ఆ జంట ఎవర్ గ్రీన్ కపుల్ గా ఇండస్ట్రీలో రికార్డులు నెలకొల్పుతూ ఉంటుంది. దీంతో ఆ కాంబోతోనే మళ్లీ రిపీటెడ్ సినిమాలు తీస్తారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఆ హీరోయిన్ తల పొగరు వల్ల ఆమెని ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేశాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. నిజానికి మహేష్ బాబుకు మంచి మనస్తత్వం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరిని దగ్గరికి చేర్చుకుంటారు. వ్యక్తిగతంగా మహేష్ బాబుకి ఎంతో గౌరవం ఉంది.

ఆయన చాలా సైలెంట్ గా ఉంటాడు. అలాంటి హీరోని కూడా హర్ట్ చేసింది ఓ హీరోయిన్. ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ నయనతార. నయనతారకు ఏకంగా మూడుసార్లు ఆఫర్ ఇచ్చినా సరే ఆమెను రిజెక్ట్ చేసి వేరే హీరోయిన్లను పెట్టుకొని హిట్ కొట్టాడట మహేష్ బాబు. అయితే సినిమాల విషయంలో నయనతార ఎటువంటి కండిషన్స్ పెడుతుందో మనకు తెలిసిందే. ఇలా మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా ఆమె విచిత్రమైన కండిషన్స్ పెట్టిందట.

దీంతో మూడు సినిమాలకు ఆమెను తిరస్కరించి వేరే హీరోయిన్స్ ని పెట్టుకున్నాడట. ఆ సినిమాలు మరేవో కాదు.. పోకిరి, అతడు, సరిలేరు నీకెవ్వరు. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలలో అవకాశం వచ్చినా నయనతార విచిత్రమైన కండిషన్లతో ఈ సినిమాలోని దూరం చేసుకుందట. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు