Mahesh Babu Upcoming Movie : మహేష్ – త్రివిక్రమ్ మళ్లీ రెడీ… ఈ సారి థియేటర్లు పగిలిపోవాల్సిందే

Mahesh Babu Upcoming Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. రాజమౌళి ప్రాజెక్టు ఇంకా స్టార్ట్ కూడా కాకముందే మహేష్ బాబు నెక్స్ట్ త్రివిక్రమ్ తో మూవీ కమిట్ అయ్యాడు అంటూ సూపర్ స్టార్ అభిమానులలో ఉత్సాహంతో ఉరకలెత్తించే వార్త ఒకటి బయట కొచ్చింది. మరి అసలు ఈ ప్రాజెక్ట్ సాధ్యమేనా? అనే వివరాల్లోకి వెళ్తే…

మరోసారి కుర్చీని మడత పెట్టాల్సిందే…

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, మరోవైపు మహేష్ బాబు మేకోవర్ పై దృష్టి పెట్టారు. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ రేంజ్ మారిపోవడం ఖాయం. మరి ఆ తర్వాత ఈ స్టార్ హీరో నెక్స్ట్ మూవీ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడు? అనే డౌట్ ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ అందరి మదిలోనూ మెదులుతోంది. అయితే ఈ ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికింది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నాడు అనేదే ఆ సమాధానం.

Guntur Kaaram Review: It's only Mahesh Babu's film and never Trivikram's-Telangana Today

- Advertisement -

రాజమౌళితో సినిమా చేయడానికంటే ముందే మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం అంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా సిల్వర్ స్క్రీన్ పై పోకిరి వేషాలు వేశారు. ఎమోషన్ తో పాటు కామెడీ కూడా కావాల్సినంత ఉన్న ఈ సినిమాలో డ్యాన్సులు అదరగొట్టి రచ్చ చేశారు మహేష్ బాబు. అయితే ఈ సినిమాపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తినప్పటికీ, ఆయన అభిమానులు మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. రాజమౌళితో సినిమా తర్వాత మళ్లీ తన అభిమానులకు ఇలాంటి ట్రీట్ ఇచ్చే అవకాశం ఉండదని భావించిన మహేష్ బాబు త్రివిక్రమ్ తో మంచి మాస్ కమర్షియల్ సినిమా చేశారు. కలెక్షన్లు పర్వాలేదు అనిపించినా, దారుణమైన నెగిటివ్ టాక్ రావడంతో మరోసారి త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా చేసే ఛాన్స్ లేదని అంతా అనుకున్నారు. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఖలేజా కూడా పెద్దగా ఆడలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబో మరోసారి సెట్ అయిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది కూడా పాన్ ఇండియా మూవీ కాబోతోంది.

మహేష్ కోసం క్యూలో డైరెక్టర్స్

మహేష్ బాబు ప్రస్తుతం తన 29వ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నారు. అయితే ఆయన 30వ ప్రాజెక్ట్ కోసం ఎంతోమంది దర్శకులు క్యూలో ఉన్నారనే చెప్పాలి. అలాంటిది అందర్నీ పక్కన పెట్టేసి ఈసారి కూడా త్రివిక్రమ్ నే మహేష్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తి చేసేలోపు, త్రివిక్రమ్ బన్నీతో చేయాల్సిన సినిమాను కంప్లీట్ చేస్తారు. ఒకవేళ SSMB29 లేట్ అయితే త్రివిక్రమ్ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా బన్నీ , రామ్ పోతినేనితో సహా మరో హీరోతో సినిమా చేస్తారు. ఏదైతేనేం మొత్తానికి మహేష్ 30వ సినిమా పక్కాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లోనే రాబోతోంది. అదికూడా హారిక అండ్ హాసిని ప్రొడక్షన్లో అని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు