Maheshbabu: సితార పుట్టినరోజు.. కాస్ట్లీ బహుమతి ఇచ్చిన మహేష్ బాబు..!

Maheshbabu.. సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇతర భాషా చిత్రాలపై దృష్టి పెట్టకుండా, కేవలం తెలుగుకే పరిమితమైన మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ గా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తన 29వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమైన మహేష్ బాబు, ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఏకంగా ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ ని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు మహేష్ బాబు.

Maheshbabu: Sitara's birthday.. Mahesh Babu gifted Costly!
Maheshbabu: Sitara’s birthday.. Mahesh Babu gifted Costly!

కూతురు సితారకు కాస్ట్లీ బహుమతి ఇచ్చిన మహేష్ బాబు..

ఇకపోతే సినిమాలకు ఎంత సమయాన్ని అయితే కేటాయిస్తారో, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల నుంచి కాస్త విరామం దొరికిందంటే చాలు కుటుంబంతో వెకేషన్ కి వెళ్తూ సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితారా ఘట్టమనేని పుట్టినరోజు నిన్న. సితార అంటే మహేష్ బాబు – నమ్రతా దంపతులకు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం ఈ పాపకు 12 సంవత్సరాల అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాలలోకి రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సితార.. ఇటీవల PMJ జువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో కూడా దర్శనమిచ్చి అందరిని ఆకట్టుకుంది.

వెలకట్టలేని బహుమతి ఇచ్చిన మహేష్ బాబు..

ఇకపోతే నిన్న సితార పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యులు చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపించారు . అంతేకాదు సితారాకు మరిచిపోలేని అత్యంత ఖరీదైన బహుమతిని అందించారు మహేష్ బాబు. సితార కుమహేష్ బాబు తల్లి, సితార నానమ్మ అయిన ఇందిరా దేవి… ఎంతో ఆప్యాయంగా దాచిపెట్టుకున్న గడియారాన్ని రీ మోడలింగ్ చేయించి సితారకు బహుమతిగా అందించారట మహేష్ బాబు. అంతేకాదు అత్యంత ఖరీదైన డైమండ్స్ తో ఈ వాచ్ ను తయారు చేయించడమే కాదు నిత్యం తన నానమ్మ జ్ఞాపకాలు తన వెంటే ఉండేలా చాలా అద్భుతంగా ఆ వాచ్ ను తయారు చేసి ఇచ్చినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ డబ్బుతో వెలకట్టలేని అత్యంత ఖరీదైన బహుమతిని మహేష్ బాబు తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

- Advertisement -

మహేష్ బాబు సినిమాలు..

ఇక మహేష్ బాబు విషయానికి వస్తే..ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సినిమా పట్టాలెక్క పోతుందని సమాచారం.. మరి ఈ సినిమాతో ఏ విధంగా గ్లోబల్ మార్కెట్ ను తన వైపు తిప్పుకుంటారో చూడాలి. మొత్తానికైతే ప్రస్తుతం మహేష్ బాబు, సితార లకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు