Family star : రీ షూటంట? అవసరం లేకున్నా?

టాలీవుడ్ లో ఈ సమ్మర్ బరిలో ఉన్న సినిమాల్లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” కూడా ఒకటి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు విజయ్ పరశురామ్ కాంబో లో వచ్చిన గీతా గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఈ కాంబోలో మూవీ వస్తుంది. ఇక ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐరనే వంచాలా అనే డైలాగ్ ఎంత ఫేమస్సో చెప్పనక్కర్లేదు.

ఇకపోతే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ కూడా పూర్తి కాకపోయే సరికి మార్చికి షిఫ్ట్ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల అంటూ మళ్ళీ ఏప్రిల్ 5 కి వస్తున్నామంటూ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అయితే దేవర తప్పుకోవడంతో ఆ డేట్ ని ఫిక్స్ చేసారని అందరికి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ఫ్యామిలీ స్టార్ సినిమాలో కొన్ని షూట్లు రీ షూట్ చేస్తున్నారని, టెక్నికల్ వర్క్ బాలన్స్ కూడా బాగానే ఉందని సమాచారం. పైగా రిలీజ్ డేట్ కి చాలా టైం ఉంది కాబట్టి మేకర్స్ ఇలా చేస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నా, ఒక రకమైన ట్రోలింగ్ కూడా చేస్తున్నారని తెలుస్తుంది.

ఎందుకంటే టెక్నికల్ వర్క్ బాలన్స్ ఉంది అంటే సరే అనుకున్నా, రీ షూట్ అంటే మాత్రం అంత అవసరం ఏముంది అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే దిల్ రాజు నిర్మించే సినిమాలకు దాదాపుగా దగ్గరుండి చూసుకుంటాడు. స్క్రిప్ట్ దగ్గర కూడా పగడ్బందీగా ఉంటాడు కాబట్టి, రీ షూట్ చేసే అవసరం రాదు అని అంటారు జనాలు. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవడానికి దాదాపు రెండు నెలల సమయం ఉంది, దీన్ని లెక్కేసుకుని రీ షూట్లు అవసరం లేకున్నా తీస్తూ పోతే ప్రమోషన్లు ఎవరు చేస్తారో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా సమ్మర్ లో వస్తున్న ఈ సినిమాకు భారీ పోటీ కూడా ఉంటుంది. కనుక ఓపెనింగ్సే కీలకం. దిల్ రాజు ఇప్పటికైనా ఇది గమనించి తాను నిర్మిస్తున్న సినిమాలపై ఫోకస్ పెడితే మంచిదని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమయినా మళ్ళీ వాయిదా వేసే పరిస్థితి రావొద్దని భావిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు