Malaika Arora : ఫేమస్ డిజైనర్ కు ఇంటిని అద్దెకిచ్చిన మలైకా… రెంట్ ఎంతో తెలుసా?

Malaika Arora : బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా తన ఫ్యాషన్, డ్యాన్స్‌ తో పాటు యాక్టింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అలాగే మలైకా మంచి వ్యాపారవేత్త కూడా. తాజాగా ఈ బ్యూటీ విలాసవంతమైన అపార్ట్మెంట్ ను అద్దెకు తీసుకుని వార్తల్లో నిలిచింది. మలైకా తన ఇంటిని ప్రముఖ డిజైనర్‌కు అద్దెకు ఇచ్చింది. ఆ అపార్ట్‌మెంట్ అద్దె ఎంతో తెలుసా?

ప్రముఖ డిజైనర్ కు మలైకా ఇల్లు అద్దెకు…

బాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో మలైకా అరోరా కూడా ఒకరు. తన ఫ్యాషన్ సెన్స్ తో పాటు లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఈ బ్యూటీ పెట్టింది పేరు. ఆమె సినిమాల గురించే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలోనే ముంబైలోని లగ్జరీ ఏరియా బాంద్రా, పాలి హిల్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మలైకా అద్దెకు ఇచ్చినట్టు సమాచారం.

అద్దె తెలిస్తే షాక్…

మలైకా అరోరా ఆ అపార్ట్‌మెంట్‌కు భారీగా అద్దె వసూలు చేస్తోంది. సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మూడు సంవత్సరాల పాటు అపార్ట్మెంట్ ను అద్దెకు ఇచ్చింది. ఈ అపార్ట్‌మెంట్ నెలవారీ అద్దె దాదాపు రూ.1.57 లక్షలు. ఇక అగ్రిమెంట్ ప్రకారం మలైకా అపార్ట్మెంట్ అద్దె ప్రతి సంవత్సరం 5 శాతం పెరుగుతుంది. మీడియా కథనాల ప్రకారం మొదటి 12 నెలల అద్దె నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు. దింతో పాటే అద్దెదారు రూ. 4.5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తారు. అంటే 3 సంవత్సరాలలో డిజైనర్ రూ.56 లక్షలు చెల్లించాలి. మొత్తానికి మలైకా మూడేళ్ళలోనే అరలక్షకు పైగా సంపాదిస్తుందన్నమాట.

- Advertisement -

మలైకా అరోరాకు బాంద్రా వెస్ట్‌లోని 81 ఓరియట్ బిల్డింగ్‌లో ఫ్లాట్ కూడా ఉంది. మలైకా అరోరా ప్రియుడు అర్జున్ కపూర్ కు కూడా ఓరియట్ బిల్డింగ్‌లో అపార్ట్‌మెంట్‌ ఉండేది. దాన్ని అతను 2022లో రూ.16 కోట్లకు అమ్మేశాడు.

మాజీ భర్తతో కలిసి ప్రొడక్షన్ లోకి…

నటిగా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా, వీజేగా మలైకా అరోరా తనదైన ముద్ర వేసుకుంది. 2008లో ఆమె తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై ‘దబాంగ్’ సినిమా సిరీస్ ను నిర్మించారు. మలైకా అరోరాకు తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు అర్హాన్ ఖాన్. అతను సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. మలైకా కొడుకు సొంతంగా పాడ్‌కాస్ట్ నడుపుతున్నాడు. 50 ఏళ్ల వయస్సులో కూడా మలైకా అరోరా అద్భుతమైన స్టైల్, ఫ్యాషన్ సెన్స్ తో తనముందు యంగ్ హీరోయిన్లు దిగదుడుపే అన్పిస్తూ ఉంటుంది.

12 ఏళ్ళు చిన్నవాడితో ప్రేమ…

2019లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ సోషల్ మీడియా ద్వారా తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా చెప్పారు. మలైకా అర్జున్ కంటే 12 సంవత్సరాలు పెద్దది. వారికి వయస్సు ఎప్పుడూ సమస్య కాలేదు. తాను త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు ఇటీవలే మలైకా తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు