Sardar2 : సర్దార్ సీక్వెల్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్.. అంటే ఆమె లేనట్టేనా?

Sardar2 : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ జపాన్ అనే ప్రయోగాత్మక సినిమాతో వచ్చి అలరించాడు. ఇక ఇప్పుడు రెండు క్రేజీ సీక్వెల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సర్దార్2 కూడా ఒకటి. రెండేళ్ల కింద సర్దార్ సినిమాతో వచ్చి వంద కోట్ల బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీ, ఇప్పుడు సీక్వెల్ తో రాబోతున్నాడు. లాస్ట్ మంత్ ఈ సినిమా ప్రాతంభించగా, ఓపెనింగ్ జరుపుకుని వారం రోజులు కూడా కాకుండానే ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కూడా పూర్తయిపోయాయి. PS మిత్రన్ దర్శకత్వంలోతెరకెక్కిన సర్దార్ విడుదలైనపుడే సర్దార్ కి రెండో పార్ట్ వస్తుందని అనౌన్స్ చేసారు. కార్తీ కెరీర్ లో ఖైదీ తర్వాత ఆ రేంజ్ హిట్ అయిన సినిమా సర్దార్ కావడంతో ఈ సీక్వెల్ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా సర్దార్2 కి సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

Malavika Mohanan made an entry in Sardar2

సీక్వెల్ లో ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహనన్…

ఇక సర్దార్2 (Sardar2) సీక్వెల్‌ ను మొదటి పార్ట్ ని మించి మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు మేకర్స్. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా సర్దార్2 సీక్వెల్ కి సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్డేట్ ని అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఎంట్రీ ఇస్తుందని అనౌన్స్ చేసేసారు. కార్తీ తో ఈమెకు ఫస్ట్ సినిమా. అలాగే మాళవిక మోహనన్ ఎంట్రీ ఇవ్వగా, ఆల్రెడీ ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్. సూర్య కూడా నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఒక డౌట్ నెటిజన్ల నుండి వస్తూ ఉంది.

- Advertisement -

సీక్వెల్ లో ఈ హీరోయిన్ లేదా?

ఇక సర్దార్ ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా రాశి ఖన్నా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ లో మాత్రం మాళవిక మోహనన్ ఎంట్రీ ఇస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సర్దార్ సీక్వెల్ లో రాశిఖన్నా ఉండడం లేదా? లేదా ఇద్దరు హీరోయిన్లు కూడా సినిమాలో ఉంటారా అని ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. ఇటు ట్రేడ్ విశ్లేషకులు బహుశా మాళవిక మోహనన్ హీరోయిన్ రోల్ లా కాకుండా ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ ఏమైనా చేస్తుందేమో అని కూడా అంటున్నారు. లేదా రెండో హీరోయిన్ గా కూడా ఉండొచ్చు. మొత్తానికి రాశిఖన్నా సీక్వెల్ సినిమాలో ఉంటుందా లేదా అన్నదానికి చిత్ర యూనిట్ నుండే క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇక సర్దార్2 కథ నేపథ్యం కంబోడియా మిషన్‌ కి సంబంధించిన కథతో సినిమా నడుస్తుందని సమాచారం. సర్దార్2 సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తుండగా, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు