Lakshmika sajeevan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటి మృతి..!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత కలవరపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య కారణంగా స్వర్గస్తులవుతుండగా.. ఇప్పుడు అతి చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ఒక నటి మరణించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో స్వర్గస్తులవుతున్నారు ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రముఖ మలయాళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీకా సజీవన్ 24 సంవత్సరాల వయసులో షార్జా లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది .లక్ష్మీక సజీవన్ కెరియర్ విషయానికి వస్తే.. దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ‘సౌదీ వెల్లక్క’ సినిమాతో పాటు ఒరు యమందన్ ప్రేమకథ,’ ‘పంచవర్ణతాతా,’ ‘సౌదీ వెల్లక్క,’ ‘పూజయమ్మ,’ ‘ఉయరే,’ ‘ఒరు కుట్టనాదన్ బ్లాగ్,’ మరియు ‘నిత్యహరిత నాయగన్’ వంటి అనేక చిత్రాలలో నటించి తన నటనతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.. మొదట సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.

అంతేకాదు అట్టడుగు వర్గాలకు చెందిన వారి కథనాన్ని ఆధారంగా చేసుకొని వారి మనుగడ కోసం పోరాడుతూ అత్యద్భుతంగా తెరకెక్కించిన ‘కాక్క’ సినిమాలో పంచమి పాత్ర పోషించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.ఇక లక్ష్మీకా సజీవన్ విషయానికి వస్తే..కొచ్చిలోని పల్లురుత్తిలోని కచేరిపాడి వజ్వేలిల్‌కు చెందిన సజీవన్, లిమిత దంపతుల కుమార్తె లక్ష్మిక.. ఈమె కూడా షార్జాలో బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తూ పేరు తెచ్చుకుంది. ఇంతటి ప్రతిభావంతురాలైన నటి ఇలా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించడం అటు సినీ పరిశ్రమను ఇటు అభిమానులను శోకసంద్రంలో ముంచేస్తుంది. ఇక పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు ఆమె మరణానికి సంతాపం తెలియజేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు