Thalapathy69 : కోలీవుడ్ లో క్రేజీ బజ్.. తలపతి69 లో ప్రేమలు బ్యూటీ?

Thalapathy69 : కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ ప్రస్తుతం “ది గోట్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా ఒకటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. అయితే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమా తర్వాత విజయ్ మరో తమిళ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని సమాచారం. ప్రముఖ దర్శకుడు హెచ్. వినోథ్‌ డైరెక్షన్‌ లో తలపతి విజయ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తమిళ్ లో లాస్ట్ టైం అజిత్ తో తూనీవు సినిమా తెరకెక్కించి హిట్ కొట్టిన ఈ దర్శకుడు విజయ్ కోసం సాలిడ్ స్క్రిప్ట్ రెడీ చేసాడట. అయితే ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ స్ట్రాంగ్ బజ్ కోలీవుడ్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Mamita Baiju is playing an important role in Thalapathy69

తలపతి69లో మామితా…

ఇక హెచ్. వినోత్ డైరెక్షన్ లో తలపతి (Thalapathy69) విజయ్ నటించబోయే కొత్త సినిమాలో సమంత ఫీ మేల్ లీడ్ రోల్‌ లో నటిస్తుందంటూ ఇప్పటికే నెట్టింట న్యూస్ వస్తుండగా, లేటెస్ట్ గా మరో న్యూస్ కోలీవుడ్ లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ ‘మమితా బైజు’ కీలక పాత్రలో నటించబోతుందని కోలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. రీసెంట్ గా డైరెక్టర్ వినోత్ ముఖ్యమైన పాత్ర కోసం మమితా బైజును కలిశాడట.ఈ వార్త నిజమా కదా అన్నది మేకర్స్ నుండే క్లారిటీ రావాలి. ఒకవేళా నిజమైతే మాత్రం మామితా బైజు తమిళ్ లో బిజీ అవడం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.

- Advertisement -

గోట్ రిలీజ్ అయ్యాకే అనౌన్స్ మెంట్?

ఇక హెచ్. వినోత్ దర్శకత్వంలో విజయ్ సినిమా ‘గోట్’ సినిమా రిలీజ్ అయ్యాకే ఈ సినిమా పట్టాలెక్కే చాన్సు ఉంది. అలాగే ఈ సినిమాకి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించబోతున్నాడని సమాచారం. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుందని టాక్. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో వినోథ్ డైరెక్షన్ లో చేసే సినిమాయే చివరి సినిమా అని సమాచారం. ఇక సెప్టెంబర్ లో రిలీజ్ కానున్న విజయ్‌ ది గొట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ సినిమా నుండి మూడో సాంగ్ రిలీజ్ కాగా, ఈ సాంగ్ అంతగా రెస్పాన్స్ తెచ్చుకోవడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు