Mammootty : ప్లాప్ టాక్ తోనూ భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న మలయాళం మూవీ!

Mammootty : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఇయర్ ఇప్పటికే మూడు సినిమాలు రిలీజ్ చేసిన మమ్మూట్టి తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో తెలుగులో యాత్ర2 సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన విషయం తెలిసిందే. ఆ సినిమా అంతగా ఆడలేదు. అయితే ఆ తర్వాత “బ్రహ్మయుగం” అనే విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కమర్షియల్‌ ఎలిమెంట్స్ కు దూరంగా ఉన్నా కూడా మమ్ముట్టీ ప్రయోగంను చాలా మంది అభినందిస్తూ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్‌ లు ఆ సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా చేశాయి. బ్రహ్మయుగం సినిమా ఒక సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగులో ఆడకపోయినా మలయాళం లో బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. అయితే తాజాగా మమ్మూట్టి నటించిన తాజా చిత్రం “టర్బో” ప్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా కూడా ఆ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు సాధిస్తుంది.

Mammootty's Turbo movie crossed the 50 crore mark

ప్లాప్ టాక్ తోనూ భారీ వసూళ్లు..

అయితే బ్రహ్మయుగం సినిమాతో పోల్చితో మమ్ముట్టీ తాజా చిత్రం టర్బో కి నెగటివ్‌ టాక్ ఎక్కువగా వచ్చింది. మెగాస్టార్‌ మమ్ముట్టీ స్థాయికి టర్బో సినిమా ఏమాత్రం సెట్‌ కాలేదు అని, అసలు ఇలాంటి సినిమాలో ఎలా మమ్ముట్టీ నటించాడు అంటూ రివ్యూవర్స్ తో పాటు కొందరు ప్రేక్షకులు కూడా అసహనం వ్యక్తం చేశారు. కానీ టర్బో కి ఏమాత్రం పాజిటివ్‌ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసేది. నెగిటివ్ టాక్ రావడంతో కనీసం పాతిక కోట్ల వసూళ్లు అయినా ఈ సినిమా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అనూహ్యంగా టర్బో ఇప్పటి వరకు రూ.57 కోట్ల వసూళ్లు రాబట్టింది. మలయాళ బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మమ్ముట్టీ గత చిత్రం బ్రహ్మ యుగం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇప్పుడు టర్బో సినిమా రూ.57 కోట్ల వసూళ్లు నమోదు చేయడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

- Advertisement -

థియేటర్లలో మరిన్ని కలెక్షన్లు..

ఇదిలా ఉండగా మమ్మూట్టి (Mammootty) టర్బో సినిమా ఇంకో పది రోజులు సినిమా కు ఓ మోస్తరు వసూళ్లు వచ్చి ఉన్నా కూడా ఖచ్చితంగా వంద కోట్ల వసూళ్ల లెక్క టచ్ చేసి ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తూ ఆ నెంబర్ చేరడం అనేది అసాధ్యం. అయితే ఇప్పుడు రాబోతున్న మలయాళం సినిమాలు టర్బో కి పోటీగా రాకపోతే మరిన్ని వసూళ్లు అందుకునే ఛాన్స్ ఉంది. బ్రహ్మయుగం సినిమాని టర్బో ఆల్రెడీ వారం రోజుల్లో బీట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా మలయాళం లో ఈ ఏడాది ఇప్పటికే ఐదు వంద కోట్ల సినిమాలు ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా కూడా వచ్చేసిందన్న విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు