Manchu Brother’s: మంచు బ్రదర్స్ మధ్య మళ్లీ చిచ్చు.. అసలేమైందంటే..?

Manchu Brother’s.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు బ్రాండ్ కూడా ఉన్నది.. ముఖ్యంగా మంచి కుటుంబంలోని అందరూ కూడా సినీ సెలబ్రిటీలు కావడం గమనార్హం. అయితే గత కొద్దిరోజులుగా మంచు కుటుంబంలో మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో వీరికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనోజ్, విష్ణు ఇద్దరూ కూడా తన తండ్రి అయిన మంచు మోహన్ బాబు నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మరీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Manchu Brother's: Manchu Brothers are at loggerheads again.. What happened?
Manchu Brother’s: Manchu Brothers are at loggerheads again.. What happened?

మంచు బ్రదర్స్ మధ్య గొడవలు..

ఇదిలా వుండగా గత కొద్ది రోజుల నుంచి అటు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మాటలు లేవని.. టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి.. ఇప్పుడు ఆ ప్రచారానికి ఈ సొంత అన్నదమ్ములే మరింత ఊపిరి పోసినట్టుగా అనిపిస్తోంది.. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవలే మంచు మనోజ్ కు ఒక పాప కూడా జన్మించింది.. ఈ పాపకు దేవసేన శోభ ఎం ఎం అనే విధంగా పేరు పెడుతూ ఒక నోట్ సైతం విడుదల చేయడం జరిగింది. అయితే ఆ లెటర్లో తన తల్లిదండ్రులు అయిన మోహన్ బాబు నిర్మలాదేవి అక్క మంచు లక్ష్మి తో సహా.. అలాగే తన భార్య మౌనిక రెడ్డి అక్క అఖిల ప్రియ తో సహా.. మరి కొంతమందిని ప్రస్తావించడం జరిగింది.

మంచు మనోజ్ ట్వీట్ పై స్పందించని మంచు విష్ణు..

అయితే ఈ లేఖలో ఎక్కడా కూడా మంచు విష్ణు గురించి మాత్రం మంచు మనోజ్ ప్రస్తావన తీసుకురాలేదు.. దీంతో కావాలనే విష్ణు పై మనోజ్ ఇలాంటి ప్రవర్తన చేసినట్లుగా తెలుస్తోంది. మరొకపక్క ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ గురించి కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఒక చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.. మెగా హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్.. ఇటీవలే ప్రణీత్ వీడియోని ఖండిస్తూ.. బహిరంగంగా స్పందించడం జరిగింది. ఈ వీడియో పైన మంచు మనోజ్ కూడా ఆ వ్యక్తిని అరెస్టు చేయాలి అంటూ తన డిమాండ్ ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

- Advertisement -

అభిమానులలో ఆందోళనలు..

అయితే సాయి ధరమ్ తేజ్ ని బ్రదర్ అంటూ తెలిపారు మంచు విష్ణు.. అయితే మంచు మనోజ్ ట్వీట్ చేసినా.. అసలు తనకేమి ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా సైలెంట్ గా ఉండిపోయారు.. సాయి ధరమ్ తేజ్ ని ప్రశంసించాలి అని తెలియజేసిన విష్ణు.. మంచు మనోజ్ ట్వీట్ కి మాత్రం ఎందుకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది.. దీంతో మరొకసారి మంచు కుటుంబంలో ఉన్న విభేదాలు సైతం బయటపడినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..సొంత అన్నదమ్ములే తమ మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పకే చెబుతున్నారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వీరిద్దరే తమ మధ్య విభేదాలు ఉన్నాయని అభిమానులకు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు