Manoj-Mounika: భూమా మౌనిక అత్తారింటికి ఎంత కట్నం తెచ్చిందో తెలుసా ?

మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి మార్చ్ 3వ తేదీ రాత్రి 8:30 నిమిషాలకు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి ఇంట్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు, నెటిజెన్లు ఈ నూతన దంపతులకు విషెస్ తెలుపుతున్నారు.

మంచు మనోజ్ – మౌనిక రెడ్డి ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మనోజ్.. భూమా మౌనిక రెడ్డిల మధ్య చాలా కాలంగా ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే వీరి వివాహం గురించి అనేకసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే భూమ మౌనిక గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. మౌనిక రెడ్డి భూమా నాగిరెడ్డి – భూమా శోభారెడ్డిల రెండవ కుమార్తె. ఈమె 2016లో గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

ఈ దంపతులకు 2018 లో కుమారుడు జన్మించాడు. అతనే ధైరవ్ రెడ్డి. మౌనిక – గణేష్ మధ్య విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. భూమా మౌనికది కర్నూలులోని ఆళ్లగడ్డ నియోజకవర్గం కాగా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈమెకు మంచి పేరుంది. అయితే రెండో వివాహం అయినప్పటికీ భూమా మౌనిక అత్తారింటికి భారీగా కట్నం తీసుకువచ్చిందట. దాదాపు 80 నుంచి 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను మౌనిక కట్నంగా తెచ్చుకుందని ఇన్సైడ్ టాక్.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు