Matthu Vadhalara: చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ 

ఎన్నో అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోతాయి. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించి పెడతాయి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాకుండా ఆ సినిమాలకు మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఒక మంచి సినిమాను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందే ఉంటారు. అని ఎన్నోసార్లు ప్రూవ్ చేస్తూ వచ్చారు తెలుగు ఆడియన్స్.

2019లో మత్తు వదలరా సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు రితీష్ రానా. రితీష్ రానా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ను సాధించింది. వాస్తవానికి ఈ సినిమాకి ఎటువంటి బజ్ కూడా లేదు. అలానే సినిమాపై పెద్ద అంచనాలు కూడా లేవు. కానీ రిలీజ్ అయిన తర్వాత కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది.

ఈ సినిమా కామెడీ తో పాటు టెక్నికల్ గా కూడా ఆకట్టుకుంది. రితీష్ రానా ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, ఈ సినిమాలో చూపించిన విజువల్స్ ఈ సినిమాలు చెప్పిన నరేషన్ ఇదంతా చాలామంది సినీ ప్రేమికులను ఆకట్టుకుంది. చాలా క్రిస్పీగా మంచి కామెడీ టైమింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించి విజయాన్ని సాధించాడు.

- Advertisement -

ఈ సినిమా తర్వాత రితీష్ రానా చేసిన సినిమా హ్యాపీ బర్త్డే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. రితీష్ రానా కోసం సినిమాకి వెళ్ళిన చాలామంది ఆడియన్స్ కు ఈ సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వలేదు. ఇకపోతే ప్రస్తుతం మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2019లో రిలీజ్ అయిన మత్తు వదలరా సినిమాకి ఇప్పుడు సీక్వెలను ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 45 రోజులు పాటు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో సింహకోడూరు, సత్య , నరేష్ అగస్త్య నటించనున్నారు. ఈ సినిమాను జూన్ వరకు పూర్తి చేసి, జూలైలో మంచి డేట్ కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు