Mechanic Rocky : మెకానిక్ రాకి సినిమాకి రిపేర్లు, విశ్వక్సేన్ లో డైరెక్టర్ యాంగిల్ బయటకు వచ్చినట్టే

Mechanic Rocky : ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకెళ్లిపోతున్నాడు విశ్వక్సేన్. ఇక రీసెంట్ గానే గామి అనే ఎక్స్పరిమెంటల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కృష్ణ చైతన్య దర్శకుడిగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం మెకానిక్ రాకి అనే సినిమాను చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చింది. అయితే ఈ సినిమా అవుట్ పుట్ పైన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు విశ్వక్సేన్. ఇప్పుడు మళ్లీ మెకానిక్ రాకి సినిమాకి రిపేర్లు మొదలు పెడదామని ఫిక్స్ అయ్యారట చిత్ర యూనిట్. ఈ సినిమాలోని చాలా సీన్స్ ని రీ షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇక మెకానిక్ రాకి విషయానికి వస్తే ఈ సినిమా మీద కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లా ఉన్నావ్ అంటూ కొందరు పొగడడం కూడా చేశారు. విశ్వక్సేన్ ఎన్టీఆర్ కు ఎంత పెద్ద అభిమాని అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా టైగర్ అంటూ చెప్పిన డైలాగ్ బాగా పాపులర్ అయింది. ఇక తనలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు కాబట్టి మెకానిక్ రాకి సినిమాకి రిపేర్లు చేయించే పనిలో పడ్డాడు.

Vishwak Sen

- Advertisement -

మెకానిక్ రాకి సినిమాకు సంబంధించి రిపేర్లు మొదలు పెడుతున్నారు అని తెలియగానే చాలామందిలో ఆందోళన మొదలైంది. మామూలుగా ఒక సినిమా చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. ఇలా మళ్లీ మళ్లీ రీ షూట్స్, రిపేర్లు చేయటం వలన ప్రొడ్యూసర్ కి బర్డెన్ గా మారుతుంది. ఇది కేవలం ఈ సినిమాకు మాత్రమే కాదు చాలా సినిమాల విషయంలో మళ్ళీ ఇలా ప్యాచ్ వర్క్ అంటూ, రీ షూట్ బడ్జెట్ను పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది దర్శకులు.

ఇక విశ్వక్సేన్ కి ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తను గుర్తింపు పొందిన ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత. ఫలక్నామా దాస్ అనే సినిమాతో తనలోని డైరెక్టర్ బయటికి తీశాడు. ఆ తర్వాత అనే సినిమా కూడా దర్శకత్వం వహించాడు. అయితే తన కెరియర్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు విశ్వక్. విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సాధించుకున్నాడు.

విశ్వక్సేన్ వివాదాలు

ఇకపోతే విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా వివాదాలు వస్తుంటాయి. ప్రతి సినిమాకు ముందు ఏదో ఒకటి హడావిడి జరుగుతూనే ఉంటుంది. అయితే దాని వలన సినిమా హిట్ అయిన కూడా అంత పెద్దగా టాక్ రాకుండా పోతుంది అనేది వాస్తవం. విశ్వక్సేన్ కి మంచి మార్కెట్ ఉంది అని చెప్పొచ్చు. సినిమా అంటే ఒక ఖచ్చితమైన కొత్త కథతో ప్రేక్షకులు ముందుకు వస్తాడు అని అందరికీ ఒక నమ్మకాన్ని అయితే కల్పించాడు విశ్వక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు