Meenakshi Chaudhary : శ్రీలీల కి డబుల్ రేంజ్ లో దూసుకుపోతున్న మీనాక్షి..

Meenakshi Chaudhary : టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌద‌రి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ సంక్రాంతికి వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమా త‌ర్వాత ఈ అమ్మ‌డు ఒక్క‌సారిగా ఊపందుకుంది. ఇప్పుడు మీనాక్షి లైన‌ప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. రెండుకాదు..మూడు కాదు.. ఏకంగా అరడజను కి పైగా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ లో “ఇచ్చట వాహనములు నిలుపరాదు” అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ, ఆ తర్వాత అడవిశేష్ “హిట్ ది సెకండ్ కేస్” తో మంచి సక్సెస్ అందుకుని వరుస ఆఫర్లు అందుకుంది. ఇక ఈ ఇయర్ లో గుంటూరు కారం తర్వాత మరింత బిజీ అయింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి ఆరు సినిమాలు చేస్తుండగా, అన్నీ ప్రతిష్టాత్మక చిత్రాలే ఉన్నాయి. ఆ సినిమాల్లో వ‌రుణ్ తేజ్ తో ‘మ‌ట్కా’, దుల్కార్ స‌ల్మాన్ తో ‘ల‌క్కీ భాస్క‌ర్’, త‌ల‌ప‌తి విజ‌య్ తో ‘ ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్’, మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభ‌ర’ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే విశ్వక్ సేన్ పదో సినిమాతో పాటు, మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చేయ‌డానికి సిద్దంగా ఉందని సమాచారం.

Meenakshi Chowdary is busier than Srileela

శ్రీలీల ని మించిపోయిన మీనాక్షి..

ఇక ఇవే గాక అమ్మ‌డికి ఇత‌ర భాష‌ల నుంచి ఛాన్సులు క్యూ క‌డుతున్న‌ట్లు నెట్టింట జోరుగా ప్ర‌చారం సాగుతుంది. అయితే ఇదంతా గుంటూరు కారం స‌క్సెస్ తో వ‌చ్చిన అవ‌కాశాలు అని కొంతమంది భావించగా, అలా అనుకుంటే త‌ప్పే అవుతుంది. ఎందుకంటే ఈ అమ్మ‌డు అందులో పోషించింది చిన్న పాత్రే. మ‌హేష్ కి పెయిర్ కానే కాదు. కానీ ఆ సినిమా త‌ర్వాతే ఇన్ని వేగం పెంచింది అన్న‌ది వాస్త‌వం. వాస్త‌వానికి ఈ రేంజ్ లో సినిమాలు చేయాల్సింది శ్రీలీల‌. అందులో మ‌హేష్ కి జోడీగా నటించింది ఆ బ్యూటీనే. కుర్చీ పాట‌తో శ్రీలీల రేంజ్ అంత‌కంతకు పెరిగింది. అంత‌కు ముందే మాస్ ఆడియ‌న్స్ లోకి బ‌లంగా వెళ్లింది. ఆ ఊపు చూసి టాలీవుడ్ లో శ్రీలీల‌కి తిరుగుండ‌ద‌నుకున్నారంతా. ఛాన్సుల‌న్నీ అమ్మ‌డివే అనుకున్నారంతా. కానీ బ‌య‌ట మార్కెట్ లో సీన్ మరోలా క‌నిపిస్తుంది. గుంటూరు కారం త‌ర్వాత శ్రీలీల‌ ఒక్క సినిమాకి కూడా ఇంకా సైన్ చేయ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌మిట్ అయిన ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ చేతిలో ఉన్నా అది డిలే అవుతుంది. అది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న‌ది కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. దీంతో అమ్మ‌డు కోలీవుడ్ వైపు చూస్తోంది.

- Advertisement -

వరుస సినిమాలు ఫోటోషూట్లు..

ఇక మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సినిమాల ద్వారానే కాకుండా రెగ్యులర్ గా ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంటుంది. ఘాటు అందాలతో ఆకట్టుకుంటున్న మీనాక్షి, మరీ బోల్డ్ ఫోటోలు షేర్ చేయకపోయినా, తన కళ్ళతో హావ భావాలతోనే ఆకట్టుకుంటుంది. ఇక మీనాక్షి ఇప్పటికే తెలుగు, తమిళ సినిమాల్లో నటించగా, త్వరలో కన్నడ, మలయాళ స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించడానికి రెడీగా ఉందని సమాచారం. మరి ముందు ముందు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానం ఎవరికీ వస్తుందో చూడాలి. ఈ రేసులో శ్రీలీల, మీనాక్షి చౌదరి మధ్యే ఎక్కువ పోటీ ఉంటుందని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు