Niharika: నేను పోగొట్టుకున్న బంగారంతో ఓ ఇల్లు కట్టుకోవచ్చు.. నిహారిక కామెంట్స్ వైరల్..!

మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మొదట యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఆ తరువాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన మాట తీరుతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కాలేక నానా అవస్థలు పడుతుంది. ప్రస్తుతం భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతోంది. ఆ మధ్య పలు రకాల వెబ్ సిరీస్ లని కూడా నిర్మించింది.

ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. నిర్మాతగా సినిమాని రూపొందించబోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకి నిహారిక చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో మీరు మొదటిసారి ఎప్పుడు మేకప్ వేసుకున్నారు..? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి నిహారిక సమాధానం ఇస్తూ.. ఢీ షోకే మొదట మేకప్ వేసుకున్నానని తెలిపింది.

అంతేకాదు ఆ షో తనకి ఇప్పటికీ మెమొరబుల్ అంటూ కామెంట్ చేసింది. అలాగే మీరు ఎప్పుడైనా ఖరీదైన వస్తువులను పోగొట్టుకున్నారా.? అని ప్రశ్నించాగా.. అందులో మనమే టాప్ అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక పోగొట్టుకున్న వస్తువుల గురించి ఆమె ఇచ్చిన సమాధానాలు విని నెటిజెన్లు షాక్ అవుతున్నారు. ” చిన్నప్పుడు మా అమ్మ నాకోసం ఎన్నో రకాల డిజైన్ల నగలను తెచ్చి పెట్టేది. నేను వాటిని చాలా ఎక్కువగా పోగొట్టుకున్నాను. నేను పోగొట్టుకున్న బంగారంతో ఓ ఇల్లు కట్టుకోవచ్చు. చిన్నప్పుడు నాకు పెద్దగా తెలిసేది కాదు. పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకునే దానిని కాదు. అలా చాలా బంగారం పోగొట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు