Niharika: మెగా డాటర్ నిహారిక విడాకులకు…. ఆ స్టార్ హీరోయిన్ కారణమా ?

తెలుగు ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. ముచ్చటగా మూడేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. గత కొద్ది రోజులుగా నిహారిక విడాకులపై జరుగుతున్న వార్తలు ఎట్టకేలకు నిజమయ్యాయి. నిహారిక – చైతన్య కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేయడం, అవి మంజూరు కావడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. తన ఇంస్టాగ్రామ్ ద్వారా విడాకులను కన్ఫామ్ చేసింది నిహారిక.

ఇది ఇలా ఉండగా… అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అని తెలుస్తోంది. సమంత, అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాలను కూడా ప్రశాంతంగా ఉండనివ్వదా అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక సామ్ ను చూసే నిహారిక ఆమె భర్తకు డివోర్స్ ఇచ్చిందట. సమంతను ఇన్స్పిరేషన్ గా తీసుకుందట ఈ మెగా డాటర్. కాగా… జొన్నలగడ్డ వెంకట చైతన్య మరియు నిహారిక విడాకులు తీసుకున్న నేపథ్యంలో వీరి చుట్టూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

విడాకుల తర్వాత తన తాళిబొట్టును నిహారిక ఏం చేసిందని కొంతమంది ప్రశ్నిస్తుంటే… మరికొంతమంది భరణంగా వెంకట చైతన్య నుంచి కొణిదెల నిహారిక ఎంత తీసుకుందని చర్చిస్తున్నారు. ఇక వెంకట చైతన్య కట్టిన తాళిని అతని ఇంటికి నిహారిక కొరియర్ చేసిందని కొందరు అంటుంటే… దాదాపు 100 కోట్ల వరకు భరణం డిమాండ్ చేసిందని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా వీళ్ళ విడాకుల చుట్టూ అనేక రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు