Kalyan Dev: శుభవార్త చెప్పిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కళ్యాణ్ దేవ్ గత కొద్దిరోజులుగా విడాకులు తీసుకున్నారనే విషయం వైరల్ గా మారుతుంది. హీరోగా కూడా కళ్యాణ్ దేవ్ కెరియర్ కి సంబంధించి పెద్దగా ఎక్కడ ఆర్భాటాలు కనిపించలేదు. గతంలో వచ్చిన సూపర్ మచ్చి.. విజేత వంటి చిత్రాలు ఈయన కెరియర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. గత కొద్ది రోజుల నుంచి తన తదుపరిచిత్రం విషయంలో కూడా పెద్దగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా కనిపించలేదు కళ్యాణ్ దేవ్..

కానీ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా తన కుటుంబంలో జరుగుతున్న ఒక శుభవార్తను సైతం అభిమానులతో పంచుకోవడం జరిగింది. తన సోదరి ఐశ్వర్య లంక శ్రీమంతం ఫోటోలను కూడా షేర్ చేసి.. కుటుంబం పెరుగుతోంది అంటూ వ్యాఖ్యానిస్తూ తన ఆనందాన్ని సైతం తెలియజేయడం జరిగింది కళ్యాణ్ దేవ్..

అంతేకాకుండా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి, తన సోదరి బావ గారితో కలిసి ఉన్న ఫోటోలను కళ్యాణ్ దేవ్ షేర్ చేశారు . కళ్యాణ్ దేవ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవ్వాలంటూ పలువురు అభిమానులు సైతం తన ఇంస్టాగ్రామ్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు.. కళ్యాణ్ దేవ్ తండ్రి కూడా ఒక వ్యాపారవేత్త.. ప్రస్తుతం తండ్రి వ్యాపారాలను కళ్యాణ్ దేవ్ మెయింటైన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.ఇదిలా ఉండగా కళ్యాణ్ దేవ్ శ్రీజకు గుర్తుగా ఒక పాప పుట్టింది. అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ ఈ పాపతో కలిసి ఉన్న ఫోటోలనూ షేర్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇప్పటివరకు అధికారికంగా శ్రీజ కానీ కళ్యాణ్ దేవ్ కానీ ఎక్కడ తాము విడాకులు తీసుకున్నట్లుగా తెలియజేయలేదు. వీరిద్దరి మధ్య దూరము పలురకాల పోస్ట్ల వల్లే విడిపోతున్నారు అనే వార్తలు వినిపించేలా చేసింది. మెగా అభిమానులు మాత్రం చిరంజీవి కూతుర్ల వల్ల చిరంజీవికి డామేజ్ ఏర్పడుతోంది అంటూ పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సినిమాల విషయంలో కూడా మెగా అభిమానులు కాస్త నిరుత్సాహంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మెగా హీరోలకు కలిసి రాలేదు. అంతేకాకుండా నిహారిక కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు