Megafamily: తాతయ్య దగ్గరే ఉండబోతున్న మెగాప్రిన్సెస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు జూన్20 న తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. హైదరాబాద్లో తమ సొంత హాస్పిటల్ అయిన అపోలో లో తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. పెళ్ళైన పదకొండేళ్లకు పుట్టిన బిడ్డ కావడంతో మెగాఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయారు. చిరంజీవి మొదలుకొని వరుణ్ తేజ్ వరకు అందరూ హాస్పిటల్ కి వచ్చి దంపతులను విష్ చేసారు.

అయితే ఉపాసన రామ్ చరణ్ పెళ్ళైన తర్వాత కోనేళ్ళుగా ఫ్యామిలీతో కాకుండా విడిగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈవెంట్లలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే డెలివరీ అయిన తర్వాత తమ బిడ్డను తీసుకుని చిరంజీవి ఇంటికే వెళ్లనున్నట్టు మెగా సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇకనుండి తమ పాపతో పాటు అక్కడే ఉండబోతున్నట్టు, తాతయ్య చిరంజీవి సంరక్షణలోనే తమ పాప పెరుగుతుందని సమాచారం. ఇక చిరంజీవి మానవరాళ్లందరూ చిరు ఇంట్లోనే ఉంటారన్న విషయం తెలిసిందే. కొసమెరుపేంటంటే ఇప్పుడు ఉపాసనకు పుట్టిన బిడ్డతో కలిపి చిరంజీవికి అందరు మానవరాళ్లే పుట్టడం గమనార్హం.

ఇక చిరంజీవికి పిల్లలంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తాతయ్య సంరక్షణలోనే తమ పాప పెరిగితే తమకు ఏ టెన్షన్ ఉండదని, తమ పాప విషయంలో ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం ఉండదని చరణ్ ఉపాసన దంపతులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉపాసన కోసం తన సినిమాల షెడ్యూల్స్ అన్ని వాయిదా వేసుకున్న రామ్ చరణ్ త్వరలోనే గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు