Megastar’s Bholaa Shankar: భోళా సెన్సార్ పూర్తి – అదొక్కటే హోప్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన భోళాశంకర్ సినిమా ఆగస్టు11న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో కూడా మొదటి నుండి పెద్దగా ఆసక్తి లేదు. రీమేక్ కావడం ఒక కారణం అయితే, మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం మరో కారణం. చిరు సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్లో నటించగా హీరో సుశాంత్ కీర్తికి జోడిగా నటించాడు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాని నేపథ్యంలో జామ్ జామ్ జజ్జనక, మాలికీ బ్యూటీ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్స్ లో మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ లో గ్రేస్ మాత్రమే సినిమాకు అంతో ఇంతో పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. పెద్దగా కట్స్ ఏమీ చెప్పని సెన్సార్ UA రేటింగ్ ఇచ్చింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ సమపాళ్లలో ఉండేలా డైరెక్టర్ మెహర్ రమేష్ ప్లాన్ చేశాడని సమాచారం. ఇక చిరంజీవి పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయటంపై ఒక వర్గం అభిమానుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా, ఇంకో వర్గం అభిమానుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. మెగాస్టార్ సీన్స్ ని ఇంకొకరి సినిమాలో రెఫరెన్స్ గా వాడుకోవాలి గానీ, ఇంకొకరిని మెగాస్టార్ తో ఇమిటేట్ చేయించటం ఏంటని డైరెక్టర్ మెహర్ రమేష్ పై కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

గతంలో వచ్చిన రీమేక్ సినిమాలకు సక్సెస్ రేట్ పెద్దగా లేకపోవటం మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. ఏడాది బిగినింగ్ లో వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకొని ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చిన మెగాస్టార్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ పరంపరను కొనసాగిస్తాడా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, భోళాశంకర్ సినిమా అజిత్ వేదాళం రేంజ్ లో కాకపోయినా డీసెంట్ హిట్ అయినా అవుతుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు