Megha Akash : హీరోయిన్ పై మళ్ళీ పెళ్లి వార్తలు.. అప్పుడేనట?

Megha Akash : టాలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. లై సినిమాతో పరిచయమైన ఈ భామ తక్కువ సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చల్ మోహన్ రంగ, డియర్ మేఘ, రాజరాజ చోర వంటి సినిమాలతో నటిగా టాలీవుడ్ లో ఫేమ్ సంపాదించింది. టాలీవుడ్ లో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలు చేసే అతి తక్కువమంది టాలెంటెడ్ హీరోయిన్లలో మేఘా ఆకాష్ కూడా ఒకరు. అయితే సరైన సక్సెస్ లు మాత్రం ఇప్పటివరకు ఈ భామకు దక్కలేదు. అయినా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదిలా ఉండగా తాజాగా మేఘా ఆకాష్ పెళ్లి గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి.

Megha Akash's wedding news is viral on social media

మేఘ ఆకాష్ పెళ్లి అప్పుడే?

ఇక త్వరలో మేఘ ఆకాష్ పెళ్లి జరగబోతుందని మూడు నెలల క్రితం నెట్టింట వార్తలు జోరుగా ప్రచారం జరిగిందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో మేఘా ఆకాష్ షేర్ చేసిన కొన్ని ఫొటోల కారణంగా ఫ్యాన్స్ మేఘ ఆకాష్ కి పెళ్లి జరుగుతుందని ట్రెండ్ చేసారు. అది ఒక యాడ్ షూట్ అని తర్వాత తెలిసింది. అయితే మేఘ ఆకాష్ పెళ్లి చేసుకోబోయేది మాత్రం నిజం అని తర్వాత వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడూ అని ప్రకటించలేదు. తాజాగా మేఘ ఆకాష్ పెళ్లి అప్డేట్ వచ్చిందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ మేఘ ఆకాష్ పెళ్లి ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో జరుగుతుందని ఆమె సన్నిహితుల దగ్గరి నుండి సమాచారం వచ్చింది. అయితే దీనిపై మేఘ ఫ్యామిలీ స్వయంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

- Advertisement -

మూడు ప్రాజెక్టులతో మేఘ బిజీ..

ఇక మేఘ ఆకాష్ తెలుగులో ఛల్ మోహన్ రంగ, డియర్ మేఘా, ప్రేమదేశం, రాజ రాజ చోర, గుర్తుందా శీతాకాలం, రావణాసుర, మనుచరిత్ర వంటి చిత్రాల్లో నటించగా, సక్సెస్ కోసం మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. చివరిగా తెలుగులో మనుచరిత్ర సినిమాలో నటించిన మేఘా ఆకాష్ ఆ సినిమాతో కూడా ప్లాప్ అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో కలిసి మరో మూడు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో రెండు, తమిళ్ లో ఒక సినిమా చేస్తుండగా, బాలీవుడ్ ఆఫర్ల కోసం కూడా ఎదురుచూస్తుందని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు