RajaSaab : రాజాసాబ్ వస్తున్నాడంటే ఇక ఆ క్రేజీ సినిమా తప్పుకున్నట్టేగా?

RajaSaab : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాది కింద వరుస పరాజయాలతో సతమతమైన డార్లింగ్ ప్రభాస్ సలార్ తో మాస్ కం బ్యాక్ ఇచ్చి, లేటెస్ట్ గా కల్కి2898AD సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా 1100 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పటికీ లిమిటెడ్ స్క్రీన్ లలో స్టడీ కలెక్షన్లు వసూలు చేస్తూ వెళ్తుంది. ఇక కల్కి రిలీజ్ అయి నెల దాటిందో లేదో, అప్పుడే ప్రభాస్ నెక్స్ట్ సినిమా అప్డేట్ వచ్చేసింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాజా సాబ్ మూవీ గ్లిమ్స్ ని అఫిషియల్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక రాజాసాబ్ సినిమాను మారుతి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

Mirai movie may get postponed due to RajaSaab movie

ఈ క్రేజీ సినిమా వాయిదా పడ్డట్టేనా?

ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ రాజా సాబ్ సినిమా గ్లింప్స్ నెట్టింట ట్రెండ్ అవుతుండగా, ఈ వీడియో లో రాజాసాబ్ (RajaSaab) సినిమాను 10 ఏప్రిల్ 2025న రిలీజ్ చేస్తునట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకి మరో క్రేజీ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సినిమా పేరు “మిరాయ్”. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి వచ్చిన మంచు మనోజ్ టీజర్ కూడా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. కార్తీక్ ఘట్టమనేని “మిరాయ్” సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు మిరాయ్ సినిమా వాయిదా తప్పేట్టు లేదని తెలుస్తుంది.

- Advertisement -

క్లాష్ అవ్వడం కుదరదు.. ఎందుకంటే?

అయితే మిరాయ్ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా, ఇప్పుడు సినిమా వాయిదా పడినట్టే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రాజాసాబ్ తో మిరాయ్ సినిమా క్లాష్ అవడం కుదరదని అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాని నిర్మిస్తుంది కూడా రాజాసాబ్ నిర్మాతలే కావడం గమనార్హం. అవును… ప్రభాస్ రాజాసాబ్ ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలే, మిరాయ్ సినిమాని కూడా నిర్మిస్తున్నారు. కాబట్టి వారం రోజుల తేడాతో రెండు సినిమాలు రిలీజ్ చేస్తే మిరాయ్ సినిమాకి గట్టి దెబ్బ పడుతుంది. ఒకే బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు కాబట్టి రాజా సాబ్ కోసం మిరాయ్ వెనక్కి తగ్గుతాడని వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు