Pushpa2: అల్లు అర్జున్ జీవితంలో దోషాలు..ఫార్మ్ హౌస్ లో పూజలు..?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్…ఈ రోజు దేశవ్యాప్తంగా పేరుగా కాకుండా బ్రాండ్ నేమ్ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం ‘పుష్ప’. ఈ చిత్రం అంతర్జాతీయంగా పలు దేశాల్లోని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2003లో గంగోత్రి సినిమా చేసేటప్పుడు ఈ ఐకానిక్ స్టార్ అందుకున్న తొలి వేతనం రూ. 3500 అయితే.. ఇప్పుడు వందల కోట్లల్లో తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటి హీరోలతో పోలీస్తే.. బన్నీ క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మొన్నటికి మొన్న అలా వైకుంఠపురంలో సినిమాతో ఏకంగా బాహుబలి 1 రికార్డులను కూడా తుడిచి పెట్టేసాడు బన్నీ.

ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరో కూడా ఈయనే. వరుడు, నా పేరు సూర్య లాంటి ఒకటి రెండు సినిమాలు తప్పిస్తే ఈయన కెరీర్ లో డిజాస్టర్స్ కూడా తక్కువే ఉన్నాయి. దానికి తోడు మలయాళంలో కూడా సూపర్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు బన్నీ. ఇది ఇలా ఉండగా, ఇప్పుడు సినీ సెలెబ్రెటీల జాతకం చెప్పే ఓ స్వామి అల్లు అర్జున్ జాతకంలో పెద్ద దోషం ఉందని తేల్చేసాడట.

దీంతో రాత్రికి రాత్రి అల్లు అర్జున్ అమ్మ పరిహార పూజలు చేయించడానికి ఏర్పాటు చేసిందట. అల్లు ఫామ్ హౌస్ లో బన్నీ, స్నేహ రెడ్డి, అర్హ, అయాన్ ఈ పూజలో పాల్గొన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బన్నీకి నరదిష్టి ఎక్కువగా ఉందని…పూజల అనంతరం బన్నీ జాతకం ప్రకారం ఇండస్ట్రీని ఏలతాడంటూ ఆ పూజారి చెప్పారట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు