L2 Empuraan : పార్ట్ 2 కథ అక్కడినుండి మొదలవుతుందా?

L2 Empuraan : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన “లూసిఫర్” మూవీ 2019లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో టోవినో థామస్, వివేక్ ఒబెరాయ్, మంజు వారియ‌ర్, కీలక పాత్రల్లో నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ క్యామియోలో కనిపించాడు. అప్పట్లోనే ఈ సినిమా 130 కోట్లకి పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సినిమా బిగ్గెస్ట్ హిట్ తో లూసిఫర్ కు సీక్వెల్ ప్రకటించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇక ఎప్పటినుంచో ఈ సినిమాకి సీక్వెల్ వస్తున్నట్లు వార్తలు వచ్చినా తాజాగా మేకర్స్ అధికారికంగా “లూసిఫర్ 2” ను ప్రకటించారు. నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు సందర్భంగా లూసిఫెర్ టీం నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. “L2ఎంపురాన్” పేరుతో ఆ పోస్టర్ రిలీజ్ చేయగా, ఆ పోస్టర్ లో మోహన్ లాల్ స్టైలిష్ గా ఉండి ఆకట్టుకున్నారు. ఇక పక్కనే పవర్ ఫుల్ సెక్యూరిటీ ఉన్నట్టు చూపించారు.

Mohanlal starrer "L2 Empuraan" first look released

పార్ట్ 2 కథ అక్కడినుండేనా?

ఇక లూసిఫర్ కథ విషయానికి వస్తే.. సినిమాలో తన తండ్రి చనిపోయాక రాజకీయ పార్టీ విచ్చిన్నం అయితే హీరో వచ్చి వాళ్ళందర్నీ సెట్ చేసి గవర్నమెంట్ నిలబెడతాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన వారెవరు? తన చెల్లెలు, తమ్ముడు సహా ఎలా కలిసిపోయారు అనేది ఫస్ట్ పార్ట్ కథలో చూపించారు. ఇక లూసిఫర్ సినిమా క్లైమాక్స్ లో మోహన్ లాల్ ని విదేశాల్లో ఒక మాఫియా డాన్ గా చూపించారు. తన తమ్ముడైన టోవినో థామస్ ను ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు వెళ్లిపోయిన లూసిఫర్ ఎవరు? తండ్రి లాంటి వ్యక్తి నుంచి దూరమైన వ్యక్తి లూసిఫర్ గా ఎలా ఎదిగాడు ? అనేది ఈ సీక్వెల్ లో చూయిస్తారని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో మోహన్ లాల్ చుట్టు బాడీ గార్డ్స్ ఉండగా అతను నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే లూసిఫర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం ఇంక వెల్లడించలేదు.

- Advertisement -

ఫస్ట్ షెడ్యూల్ అక్కడేనా?

ఇక లూసిఫర్ 2 (L2 Empuraan) ఫస్ట్ షెడ్యూల్ బహుశా స్విట్జర్ ల్యాండ్ లోనే మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అక్కడే ముగిస్తారు కాబట్టి, అక్కడే షూటింగ్ మొదలు పెట్టె అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రస్తుతం మోహన్ లాల్, పృత్వి రాజ్ తమ తమ సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే సినిమా మొదలవనుందని చిత్ర యూనిట్ నుండి సమాచారం అందింది. ఇక లూసిఫర్ మళయాళంలో భారీ హిట్ అయిన తర్వాత తెలుగులో అదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఇక్కడ థియేటర్లలో వచ్చినట్టు పెద్దగా జనాలకు తెలీదు. కానీ రెండేళ్ల కింద మెగా స్టార్ చిరంజీవి ఇదే సినిమాను ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేయగా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. కానీ రీమేక్ కాబట్టి ఫ్యాన్స్ మినహాకామన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. పైగా లూసిఫర్ ఒరిజినల్ తెలుగు వెర్షన్ అప్పటికే ఓటిటి లో ఉండడం వల్ల జనాలు పట్టించుకోలేదు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు