Mokshagna : పెండింగ్ లో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ… పోస్టర్ తో నందమూరి ఫ్యాన్స్ ను చీట్ చేశారా?

Mokshagna : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ప్రత్యేక పోస్టర్‌తో ఈరోజు ఉదయం మరోసారి నందమూరి అభిమానులలో జోష్ పెంచారు. కానీ తాజా సమాచారం ప్రకారం అసలు ఈ సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి ఫ్యాన్స్ ను ఆ పోస్టర్ తో చీట్ చేశాడా? అసలు ఆ పోస్టర్ నిజమైనదేనా? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.

నందమూరి ఫ్యాన్స్ ను చీట్ చేశారా?

ఇండస్ట్రిలో దాదాపు స్టార్ హీరోల వారసులంతా హీరోలుగా అడుగు పెట్టారు ఒక్క నందమూరి వారసుడు తప్ప. ఒకానొక టైమ్ లో అసలు మోక్షజ్ఞ నటుడిగా మారే ఆలోచనలో లేడు, డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి. ఇలా పలు కారణాల వల్ల నందమూరి వారసుడి ఎంట్రీ ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ అభిమానులను నిరాశ పరచకుండా లేటుగా అయినా సరే లేటెస్ట్ గా అన్నట్టు రీసెంట్ గా హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. అప్పటిదాకా మోక్షజ్ఞ లాంచ్ విషయంలో ఎంతోమంది దర్శకుల పేర్లు విన్పించాయి. కానీ ఎట్టకేలకు బాలయ్య ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక సూపర్ హీరోగా మోక్షజ్ఞ ను లాంచ్ చేయడానికి ఆసక్తిని కనబరిచారు.

Image

- Advertisement -

ఇక ఈరోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు మోక్షజ్ఞ స్పెషల్ పోస్టర్ తో ప్రశాంత్ వర్మ ట్రీట్ ఇచ్చారు. మోక్షజ్ఞ ట్రెండీ లుక్స్ లో, ఆకర్షణీయమైన చిరునవ్వుతో ఆ పోస్టర్ లో అట్రాక్టివ్ గా కన్పించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో మోక్షజ్ఞ ఎంట్రీని స్వాగతిస్తూ ఆ పోస్టర్ ను వైరల్ చేశారు. కానీ అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ ఇంకా ఫైనల్ నరేషన్ పెండింగ్ లో ఉందని ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అంతేకాదు తాజాగా వదిలిన ఆ పోస్టర్ ను కూడా ప్రశాంత్ వర్మ టెక్నాలజీని వాడి క్రియేట్ చేయించాడు అని గుసగుసలు విన్పిస్తున్నాయి. అంతేకాదు ఈ కారణంతోనే మూవీ పూజా కార్యక్రమాలను ఈరోజు నిర్వహించలేదు అని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మూవీ లవర్స్ అంటే పోస్టర్ తో నందమూరి ఫ్యాన్స్ ను చీట్ చేశారా ? అని ఆశ్చర్యపోతున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో !?

నందమూరి సోదరుల వార్మ్ వెల్కమ్

ఇదిలా ఉండగా నందమూరి సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞను సినీ ప్రపంచంలోకి ఘనంగా స్వాగతించారు. ఎన్టీఆర్ “సినిమా ప్రపంచంలోకి మీరు అరంగేట్రం చేసినందుకు అభినందనలు! మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు అన్ని దైవిక శక్తులు మీపై ఆశీర్వాదాలను కురిపిస్తాయి! జన్మదిన శుభాకాంక్షలు మోక్షూ” అంటూ పోస్ట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు