Prashanth Varma: హడావిడి చేసి సెలైంట్ అయిపోయారేంటి.? మోక్షజ్ఞ , ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఉందా అసలు.?

Prashanth Varma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది నట వారసుల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్, నాగార్జున తనయుడు నాగచైతన్య ఇదివరకే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇకపోతే అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఎంట్రీ మోక్షజ్ఞ ది. నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడని చాలా కథనాలు వినిపించాయి. అయితే అంత హడావిడి చేశారు తప్ప ఇప్పటివరకు దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు.

Prasanth Varma

అయితే ఇప్పుడు చాలా రకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. నందమూరి మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మొదలు కాబోయే సినిమా ఇప్పట్లో అవ్వదు అనేది ఆ వార్తల సారాంశం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే హనుమాన్ అనే సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఆ సినిమాకి కంటిన్యూస్ గా జై హనుమాన్ అనే సినిమా పనుల్లో పడిపోయాడు. అలానే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ తాను చేస్తాను అని ఇదివరకే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే పనుల్లో బిజీగా ఉన్నాడు. దీన్ని బట్టి ఇప్పట్లో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాదు అని అందరికీ ఒకసారి నమ్మకం వచ్చేసింది.

- Advertisement -

ఇక నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే ఒక విభిన్నమైన దర్శకుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత చేసిన కల్కి జాంబిరెడ్డి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనిపించుకున్నాయి. ఇక హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది పెద్ద స్టార్స్ తో తన సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఇక మోక్షజ్ఞ విషయానికి వస్తే తను కూడా ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నాడు. చాలా లావుగా ఉండే మోక్షజ్ఞ సినిమా కోసం చాలా కష్టపడి వెయిట్ కూడా తగ్గాడు. కేవలం వెయిట్ తగ్గడమే కాకుండా సినిమాకి అవసరమైనవన్నీ కూడా నేర్చుకునే పనిలో పడ్డాడు. ఇప్పుడొచ్చినా కూడా ఒక సరైన కథతో ప్రేక్షకులు ముందుకు వస్తే ఖచ్చితంగా ఆదరించడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు