Ramcharan Daughter: చెర్రీ కూతుర్ని చూసుకునే “ఆయా” జీతం తెలిస్తే షాక్..!

Ramcharan Daughter

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరుత సినిమా ద్వారా అడుగుపెట్టి తన రెండవ సినిమా మగధీరతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తన 16వ సినిమాని తెరకెక్కించబోతున్నారు.

ఇకపోతే రామ్ చరణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసనను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల తర్వాత గత ఏడాది ఈ జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఆ అమ్మాయికి లలితా సహస్రనామాల నుంచి పేరు తీసుకొని క్లీంకారా అంటూ నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆ పాపని ఇంతవరకు మీడియా ముందుకు తీసుకురాలేదు ఈ జంట. ఇప్పుడు తమ కూతుర్ని పెంచేందుకు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైల్ ని ఫాలో అవుతున్నారు ఈ మెగా జంట.

ముఖ్యంగా రామ్ చరణ్ – ఉపాసన తమ కూతురి కోసం ప్రత్యేకంగా ఒక గది ని డిజైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూతురు సంరక్షణ కోసం ప్రముఖ బాలీవుడ్ నానీ (ఆయా) ని నియమించారు.ఇక ఈమె జీతం తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే..క్లీంకారా కేర్ టేకర్ గా పనిచేస్తున్న ఈమెకి నెలకు 3 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితం రామ్ చరణ్ తన కుమార్తెతో కలిసి గుడికి వెళ్ళగా వారితోపాటు దాదీ సావిత్రి కూడా ఉన్నారు.. సావిత్రి బాలీవుడ్ లో చాలా ఫేమస్.. ఇప్పటికే ఈమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కొడుకు తైమూర్ అలీఖాన్ కేర్ టేకర్ గా పని చేశారు.. కరీనాకపూర్ కొడుకుని చూసుకున్న తర్వాత షాహిద్ కపూర్ కుమార్తెను కూడా ఆమె చూసుకుంది.

- Advertisement -

ఇకపోతే మొదట్లో నెల జీతం ఒకటిన్నర లక్షల రూపాయలు తీసుకున్న ఈ దాదీ సావిత్రి.. ఇప్పుడు మెగా మనవరాలను చూసుకోవడానికి ఏకంగా రూ .3లక్షల జీతాన్ని డిమాండ్ చేస్తోందట.. ఇక ఈమెకు ఉన్న డిమాండ్ కారణంగానే మెగా దంపతులు కూడా ఈమెకి రూ .3లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈమె క్లీంకారా సంరక్షకురాలిగా పనిచేస్తోంది. ఇకపోతే ఈమెకు ఈ రేంజ్ లో జీతం ఇవ్వడం మెగా ఫ్యామిలీకి పెద్ద విషయం ఏమీ కాదు అని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీ చాలా రిచ్ కావడంతో పాటు అటు ఉపాసన ఫ్యామిలీ కూడా బాగా సౌండ్ పార్టీ.. అందుకే తమ పాపని చూసుకోవడానికి ఉపాసన ఈమెను నియమించుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విషయం తో దాదీ సావిత్రి బాగా ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు