Krishnamma : థియేటర్ల బంద్ తో కృష్ణమ్మ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇలా చేస్తే బ్రేక్ ఈవెన్ ఖాయం?

Krishnamma : టాలీవుడ్ లో సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలతో మెప్పించి ఇప్పుడు హీరోగా తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో సత్యదేవ్. విలక్షణ నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, హీరోగా మారిన తర్వాత విభిన్నమైన చిత్రాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇక రీసెంట్ గా సత్యదేవ్ నటించిన మాస్ కమర్షియల్ ఎమోషనల్ రివెంజ్ మూవీ ‘కృష్ణమ్మ’ థియేటర్లలో మే 10న రిలీజైన విషయం తెలిసిందే. వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించిన ‘కృష్ణమ్మ’ సినిమా సత్యదేవ్ లోని నటుడిని మరింత కొత్తగా ఆవిష్కరించింది. సత్యదేవ్ మాస్ పెర్ఫార్మన్స్ కి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. కానీ సినిమా టాక్ పరంగా కంటెంట్ పరంగా అంత మంచి రెస్పాన్స్ తెచుకోలేకపోయింది. అటు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ రాగా, ఇటు విమర్శకుల నుంచి సినిమాలో సత్యదేవ్ పెర్ఫార్మన్స్ తప్ప ఏమి లేదనే మాటలు వినిపించాయి. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి ఓపెనింగ్స్ నే సాధించింది. కానీ ఎన్నికల హడావిడి వల్ల ఆ తర్వాత సినిమాని పట్టించుకోలేదు.

ఎన్నికలు పూర్తయ్యాయి.. మెల్లిగా థియేటర్లకు జనాలు..

ఇక సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ'(Krishnamma) మూవీ కి ముందుగా నెగిటివ్ రివ్యూ లు రాగా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి అయిపోయాక మెల్లిగా థియేటర్లకు రావడం ప్రారంభించారు జనాలు. ఈ క్రమంలో కృష్ణమ్మ సినిమాను తాజాగా చూసిన ఆడియన్స్ ఇప్పుడు ‘కృష్ణమ్మ’ మూవీ కి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. సినిమా బాగుందని అక్కడక్కడా చెబుతున్నారు. సత్యదేవ్ యాక్టింగ్ అదరగొట్టేశారని అంటున్నారు. మరోసారి సత్యదేవ్ తన టాలెంట్ ను చూపించారని అంటున్నారు. తాజాగా ఎన్నికల హడావుడి ముగిశాక రిలాక్స్ అవుతున్న జనాలు, ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ చిత్రమైన ‘కృష్ణమ్మ’ను ఆదరిస్తున్నారు.

Movie makers new plan for Krishnamma to break even.

- Advertisement -

సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు మేకర్స్ ప్లాన్?

ఇక తాజాగా తెలంగాణాలో పది రోజులు సింగిల్ స్క్రీన్స్ బంద్ ప్రకటించడంతో మే చివరి వరకు పెద్దగా సినిమాల రిలీజులు లేవు. దీంతో ఇప్పుడు ‘కృష్ణమ్మ’కు వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయితే
తెరిచి ఉన్న కొన్ని థియేటర్లలో, అలాగే మల్టిప్లెక్స్ లలో మంచి వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి పోటీ నెలకొందని టాక్ నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్లలో ఇప్పుడు పుంజుకుంటూ స్టడీ కలెక్షన్లు సాధిస్తున్న కృష్ణమ్మ కి మళ్ళీ ప్రమోషన్లు స్టార్ట్ చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇక 3 కోట్ల బిజినెస్ చేసిన కృష్ణమ్మ ఇప్పటివరకు 1.68 కోట్ల షేర్ రాబట్టగా, ఇంకా బ్రేక్ ఈవెన్ కి 1.32 కోట్ల దూరంలో ఉంది. ఇక ఆయావా రోజు కూడా ఈ సినిమా 20 లక్షలకి పైగా రాబట్టింది. రావాల్సిన టార్గెట్ తక్కువే ఉంది కాబట్టి, ఇప్పటినుండి ప్రమోషన్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు