Kalki2898AD : సినిమా ఇచ్చిన ఇన్నిరోజులకు పేరు చెప్పారేంటి? అంటే రెండో పార్ట్ లో ఏమైనా?

Kalki2898AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి2898AD సినిమా వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. రెండు వారాల కింద విడుదలైన కల్కి సినిమా ప్రీమియర్స్ తోనే యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ వసూళ్లు కొల్లగొడుతూ రోజుకో రికార్డు క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ విజువల్ వండర్ రేంజ్ లో తెరకెక్కించడంతో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 900 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి అతి త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అవుతుంది.

Mrinal Thakur as Divya in the movie Kalki2898AD

కల్కి లో రివీల్ చేసిన గెస్ట్ పాత్ర..

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించిన ప్రముఖుల పాత్రలను సినిమా విడుదలైన తర్వాత రోజుకు ఒక్కో పాత్రకి సంబంధించి పేర్లని రివీల్ చేస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు మృణాల్ ఠాకూర్ పాత్ర యొక్క పేరు దివ్య అని రివీల్ చేసారు మేకర్స్. అయితే సినిమాలో కూడా మృణాల్ తన పేరు దివ్య అని చెప్తుంది కానీ, మేకర్స్ మాత్రం ఇప్పటివరకు ఈ పాత్ర గురించి చెప్పకుండా ఇప్పుడు చెప్పారు. అంటే కల్కి రెండో పార్ట్ (Kalki2898AD) లో ఏమైనా దివ్య పాత్రకు సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా అని చర్చ నడుస్తుంది. ఒకవేళ ఉంటే మృణాల్ పంట పండినట్టే. అయితే రెండో పార్ట్ షూటింగ్ మాత్రం ఇప్పట్లో మొదలయ్యేలా లేదు.

- Advertisement -

వెయ్యి కోట్లు వస్తాయా?

ఇదిలా ఉండగా కల్కి సినిమా ఇప్పటికే 900 కోట్లు కొల్లగొట్టి వెయ్యి కోట్ల మార్క్ వైపునకు వెళ్తుండగా, ఈ సినిమా జోరుకు ఈరోజు తెలుగులో భారతీయుడు2, హిందీలో సర్ఫిరా సినిమాలు అడ్డుకట్ట వేసాయి. అయితే ఈ సినిమాల టాక్ కూడా అంతగా ఏమి రాలేదని తెలిసిందే. మరి ఈ రెండు సినిమాలను తట్టుకుని కల్కి జోరు కంటిన్యూ చేయగలడా అనేది ముందుముందు తెలుస్తుంది. ఇక మూడో వీకెండ్ లో కల్కి ఖచితంగా రికార్డు సృష్టిస్తుందని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇక ప్రభాస్ అయితే సినిమా ప్రమోషన్లకు బ్రేక్ ఇచ్చి, రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు