Mrunal Thakur: టాలీవుడ్ కు తప్పుడు సంకేతాలు… హీరోయిన్ వల్ల తలలు పట్టుకుంటున్న నిర్మాతలు

సినిమా విడుదల దగ్గర పడుతుందంటే కచ్చితంగా ప్రమోషన్స్, ప్రమోషనల్ టూర్స్ విషయంలో టీమ్ అంతా వీలైనంత స్పీడ్ గా ఉండాలి. అలాగే ప్రమోషన్స్ తో సినిమాపై మరింత హైప్ పెంచేలా ఉండాలి. తాజాగా విడుదలైన ‘యానిమల్’ టీం చేసిన ప్రమోషన్ లే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వారి ప్రమోషన్స్ సినిమాను ఈరోజు ఈ రేంజ్ లో నిలబెట్టాయి. ప్రమోషన్స్ కారణంగానే ‘యానిమల్’ టీం ఫస్ట్ డే భారీ ఓపెనింగ్ లను రాబట్టుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు హ్యాండ్ ఇస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

“సీతారామం” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ “హాయ్ నాన్న” ప్రమోషన్స్ కి కావాల్సినన్ని డేట్స్ కేటాయించలేదనే విషయం అందరికీ తెలిసిందే. గత 20 రోజుల నుంచి నాని ఒక్కడే వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే హీరోయిన్ గా నటించిన మృణాల్ మాత్రం డేట్స్ సమస్య సాకుతో కేవలం రెండు రోజులు మాత్రమే సినిమా ప్రమోషన్స్ లో పాలుపంచుకుంది.

ఇక దీపావళి సమయంలో నాని ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటే, మృణాల్ మాత్రం ముంబైలో దీపావళి పార్టీకి హాజరై ఎంజాయ్ చేసింది. దీంతో ఆమె సినిమాను ప్రమోట్ చేయకుండా ఇలాంటి పార్టీలకు మాత్రం ఎలా హాజరవుతోంది అని ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక మరో రెండు రోజుల్లో ఆమె ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ షూటింగ్ కోసం యూఎస్ఏకు వెళ్లబోతోంది. దీంతో “హాయ్ నాన్న” సినిమా ప్రమోషన్లకు ఈ బ్యూటీ బైబై చెప్పినట్టే.

- Advertisement -

మరోవైపు “ఫ్యామిలీ స్టార్” మూవీ షూటింగ్ కోసం మృణాల్ హైదరాబాద్ కు రాకపోవడంతో ఈ మూవీని నిర్మిస్తున్న దిల్ రాజు ఇటీవల షెడ్యూల్ ను ఏకంగా ముంబైకి మార్చాల్సి వచ్చిందట. మరి మృణాల్ హైదరాబాద్ కు ఎందుకు రాలేకపోతోంది అనేది అర్థంకాని ప్రశ్న. హైదరాబాద్ కు మాత్రం రాలేకపోయిన ఈ బ్యూటీ ముంబై స్టూడియోలో షూటింగ్ కోసం మాత్రం ఈజీగా అందుబాటులోకి వచ్చేసింది. నిజానికి ఇది నిర్మాతలను ఇబ్బంది పెట్టే విషయమే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.

మృణాల్ ఇలాగే ప్రవర్తిస్తూ వెళ్తే టాలీవుడ్ కు ఈ బ్యూటీ తప్పుడు సంకేతాలను పంపినట్టుగా అవుతుంది. అలా గనక జరిగిందంటే నిర్మాతలు ఆమెను టాలీవుడ్ కు దూరం పెట్టే చాన్స్ ఉంది. మృణాల్ కు స్టార్ స్టేటస్ వచ్చింది అంటే అది టాలీవుడ్ వల్లనే. “సీతారామం” మూవీలో ఆఫర్ ఇవ్వడం, ఆ తర్వాత అది హిట్ అవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ రేస్ లోకి దూసుకొచ్చింది. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రవర్తిస్తున్న తీరుతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఇప్పటికైనా మృణాల్ తన ప్రవర్తన మార్చుకుని జాగ్రత్తగా ఉంటుందా లేదా సక్సెస్ తలకెక్కి ఇలాగే కంటిన్యూ అవుతుందా? అనేది చూడాలి..

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు