Mrunal Thakur : ఈ ఒక్క గండం దాటితే మృణాల్ నెంబర్ వన్ హీరోయిన్

మా హీరోయిన్ ఈ ఒక్క గండం గట్టెక్కితే చాలు… ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ అభిమానులంతా కోరుకుంటుంది ఇదే. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఇప్పటికే తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఆమె తొలి తెలుగు మూవీ “సీతారామం”లో ఆకట్టుకునే అందంతో, ఆకర్షణీయమైన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా యూత్ అంతా ఆమె మాయలో పడిపోయారు. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ తన రెండవ మూవీతో మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి “హాయ్ నాన్న” అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ టాప్ హీరోయిన్ గా తిష్ఠ వేయడానికి ఇదే అనుకూల టైం అని, కాబట్టి ఆ ఒక్క గండం గట్టిగా చాలని ప్రార్థిస్తున్నారు.

నిజానికి మృణాల్ నటనపరంగా తన ఫస్ట్ మూవీలోనే నిరూపించుకుంది. అయితే ఆమె తెలుగు చిత్ర సినిమాలో స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్లాలని అనుకుంటే మాత్రం ఫస్ట్ మూవీతో చేసిన మ్యాజిక్ ను రిపీట్ చేయడం చాలా ముఖ్యం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగా ఉంది. గతంలో పూజా హెగ్డే ఆ ప్లేస్ ను ఆక్రమించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ బ్యూటీ సైడ్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల, మృణాల్ ఈ ఇద్దరు హీరోయిన్ల హవానే నడుస్తోంది. నిజానికి శ్రీలీల టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని టాలీవుడ్ లో సుస్థిరం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఆమె వరుస ఫ్లాప్ లతో సతమతమవుతోంది. చేతిలో చాలా సినిమాలు ఉన్నప్పటికీ ఇలా వరుసగా సినిమాలు ప్లాప్ అవ్వడం అంటే ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. శ్రీలీల రీసెంట్ మూవీస్ స్కంద, ఆదికేశవ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. నెక్స్ట్ రాబోయే “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” కూడా ఫ్లాప్ అయితే హ్యాట్రిక్ డిజాస్టర్ ఆమె ఖాతాలో పడడం ఖాయం.

కాబట్టి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ ను చేజెక్కించుకునే అవకాశం మృణాల్ ఠాకూర్ కే ఉంది. “హాయ్ నాన్న” మూవీ కనుక హిట్ అయితే టాలీవుడ్ మేకర్స్ అంతా ఆమెకు నెంబర్ వన్ ప్లేస్ ను పట్టం కట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఒక్క మూవీ హిట్ అయితే మృణాల్ గోల్డెన్ లెగ్ గా అవతరిస్తుంది. ఇక ఈ బ్యూటీ తన మూడవ సినిమాను సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో చేస్తున్న విషయం తెలిసిందే. “ఫ్యామిలీ స్టార్” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు