Kalki 2898 AD: ప్రభాస్ ఎంట్రీ సీన్ పై మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..!

ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కల్కి 2898AD. ఇందులో దీపికా పదుకొనే, దిశాపటాని, కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే .. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. మరొకవైపు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా నిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచీ మరో ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.. అది కూడా ప్రభాస్ ఎంట్రీ సీన్ కి సంబంధించి వార్త కావడంతో అభిమానులు సైతం సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో కాలా, వడ చెన్నై, కబాలి, దసరా వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఈయన ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ప్రభాస్ ఎంట్రీ సీన్ గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.. ముఖ్యంగా ఈ సినిమాకి తాను హై లెవెల్ మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

సంతోష్ నారాయణన్ మాట్లాడుతూ.. నేను ప్రభాస్ సినిమా కోసం సంగీతాన్ని ఇప్పటికే కంపోజ్ చేశాను.. కానీ మళ్ళీ మళ్ళీ దాని పైనే పనిచేస్తున్నాను.. ఎందుకంటే ప్రభాస్ మాస్ అప్పీల్ ప్రేక్షకులకు కనిపించాలని అనుకుంటున్నాను..ముఖ్యంగా ప్రభాస్ ఫినామినేషన్ కాబట్టి ఆయన కోసం చాలా స్పెషల్ గా మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాను..ఇకపోతే ఈ సినిమాకి ఆయన ఎంట్రీ సీన్ పెద్దది.. భారీగా ఉంటుంది.. కాబట్టి అదే స్థాయిలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అందిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు సంతోష్ .. ఇకపోతే ఇప్పుడు సంతోష్ చేసిన కామెంట్లను బట్టి చూస్తే కల్కి సినిమాలో ప్రభాస్ ఎంట్రీ సీను గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే ఈయన చేసిన కామెంట్లు ఇప్పుడు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇకపోతే రూ.600 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ మే తొమ్మిదవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ రాజా సాబ్, స్పిరిట్ , సలార్ పార్ట్ 2 వంటి సినిమాలలో కూడా నటిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు