GOAT : “గోట్” దర్శకుడిని తిడుతున్న చై ఫ్యాన్స్.. ఆ మాత్రం ఉంటుందిలే!

GOAT : కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరు వెంకట్ ప్రభు. గ్యాంబ్లర్, మనాడు వంటి సినిమాలతో భారీ విజయాలు సాధించిన ఈ దర్శకుడు ఇప్పుడు దళపతి విజయ్ తో “గోట్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడన్న విషయం తెలిసిందే. గ్రేట్స్ అఫ్ అల్ టైం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ తో పాటు ప్రభుదేవా, ప్రశాంత్ లు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక తాజాగా విజయ్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయిన ‘గోట్’ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక టీజర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ టీజర్ చూసి నాగ చైతన్య అభిమానులు మాత్రం గోట్ దర్శకుడు వెంకట్ ప్రభుని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్ప్పాలంటే తిడుతున్నారని చెప్పాలి. దానికి దీనికి సంబంధం ఏంటా అంటే గత ఏడాది నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడి సినిమా తీసింది ఈ తమిళ దర్శకుడే. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయింది.

Naga Chaitanya fans are firing on GOAT director Venkat Prabhu

నాగ చైతన్య కష్టం వృధా చేసిన దర్శకుడు!

ఇక వెంకట్ ప్రభు దర్శకుడు గా లాస్ట్ ఇయర్ తెలుగులో నాగ చైతన్య హీరోగా “కస్టడీ” సినిమా చేసాడు. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. నిజంగా చై అభిమానులు అంత సులభంగా మర్చిపోలేని డిజాస్టర్స్ లో కస్టడీది ప్రత్యేక స్థానం. నాగ చైతన్య, కృతి శెట్టి కలయికలో వచ్చిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, రాంకీ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో పాటు, యువన్ శంకర్ రాజా సంగీతపు హంగులు ఎన్ని ఉన్నా దర్శకుడు వెంకట్ ప్రభు కనీస స్థాయిలో మెప్పించేలా తీయలేకపోయాడు. ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. పలు రిస్కీ ఫైట్లు చేసాడు. ఒక సామాన్య కానిస్టేబుల్ గా నాగ చైతన్య మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ అదంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇప్పుడిదే వెంకట్ ప్రభు తమిళంలో దళపతి విజయ్ తో డ్యూయల్ రోల్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం తీశాడు. విజయ్ బర్త్ డే రోజు ఒక చిన్న టీజర్ తోనే సినిమాపై హైప్ పెంచేశాడు. విజయ్ ద్విపాత్రల్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన గోట్ లో విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వయసు తక్కువగా కనిపించడం కోసం విజయ్ కి ప్రత్యేక మేకప్ చేయడమే కాక దాని కోసమే ఎనిమిది కోట్ల దాకా ఖర్చు పెట్టారు.

- Advertisement -

తెలుగు హీరోని లైట్ తీసుకున్నాడా?

ఇక గోట్ టీజర్ తో ఓ రేంజ్ లో రచ్చ చేసిన వెంకట్ ప్రభు, నాగ చైతన్య కి మాత్రం ప్లాప్ ఇస్తాడని ఊహించలేదు. మరి తెలుగు హీరో అని ఏదో తీద్దాంలే అన్నట్టు సాదా సీదాగా తీసాడా? లేక మనొళ్లేమైనా చులకనా? అన్నది తెలీదు గాని నాగ చైతన్య అభిమానులు మాత్రం వెంకట్ ప్రభు పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇది చైతు ఒక్కడికే జరగలేదు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామిని గుడ్డిగా నమ్మడం వల్ల రామ్ కి ది వారియర్ రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. ఈ దర్శకుల ట్రాక్ రికార్డు చూసి తొందరపడి కథలను విశ్లేషించుకోకపోవడం వల్ల వచ్చిన నష్టమిది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి, కానీ ఇకపై మన హీరోలు కోలీవుడ్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తున్నప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటే మంచిదని ఫ్యాన్స్ నుండి వస్తున్న మాట. ఇక కస్టడీకు ముందు మానాడుతో శింబుకి సూపర్ హిట్ ఇచ్చిన వెంకట్ ప్రభు రిలీజ్ కు ముందే గోట్ మీద బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇస్తున్నాడు. ఎటొచ్చి చైతుకే కస్టడీ పేరుతో షాక్ ఇచ్చాడు. అన్నిటికి మించి తెలుగు నేటివిటీ తెలియని వాళ్ళతో రిస్క్ చేస్తే అలాగే ఉంటుందని నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు