Naga Chaitanya – Sobhita: ప్రేమ చిగురించింది అక్కడే..కానీ..?

Naga Chaitanya – Sobhita.. సమంతకు దూరమైన నాగచైతన్య ఇటీవలే ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ తో నిశ్చితార్థం చేసుకున్నారు. మరి వీరిద్దరి మధ్య లవ్ ఎప్పుడు పుట్టింది ? ఎక్కడ పుట్టింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి నాగచైతన్యను వదిలేసిన తర్వాత శోభితాను ఎప్పుడు కలిశారు? అసలు వీరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Naga Chaitanya - Sobhita: That's where love started..but..?
Naga Chaitanya – Sobhita: That’s where love started..but..?

సమంతతో బ్రేకప్.. శోభిత తో ఎఫైర్..

నాగచైతన్య , సమంతతో బ్రేకప్ చేసుకున్న తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల విషయం అప్పట్లో హాట్ టాపిక్ అవ్వడమే కాదు వీరిద్దరి డివోర్స్ పై ఎన్నో రకాల రూమర్లు చెక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో చైతు రహస్యంగా డేటింగ్ చేస్తున్నారనే వార్త గట్టిగా వినిపించింది. పైగా వీరిద్దరి ఎఫైర్ పై జోరుగా చర్చ సాగింది.దీంతో వీరిద్దరికి సంబంధించిన రహస్య ఫోటోలు కూడా అప్పుడు మరింత వైరల్ అయ్యాయి. అంతేకాదు వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నారని, నేటిజెన్లు కూడా వాపోయారు. తరచూ వెకేషన్స్ కి వెళ్తున్నారు. కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి కూడా పలుమార్లు ఆమెను తీసుకెళ్లాడనే వార్త కూడా వినిపించింది. కానీ ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండిస్తూ వచ్చారు.

కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం.

అయితే చివరికి మీడియా చెప్పింది నిజమైంది. వీరిద్దరూ నిన్న నిశ్చితార్థం చేసుకున్నారు. మరి వీరిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైంది అంటే.. సమంత నుంచి విడిపోయిన తరువాతనే నాగచైతన్య.. శోభితకు కనెక్ట్ అయ్యారట. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడిందని ఒక ఫ్రెండ్ బర్తడేలో వీరు కలిసినట్టు సమాచారం. మొదటి పరిచయంలోనే వీళ్లు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారట. ఆ రోజు నుంచి కలిసి తిరగడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్ లో కూడా కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య కేవలం ఆరేళ్లు మాత్రమే ఏజ్ గ్యాప్ అని తెలుస్తోంది. 1986లో నాగచైతన్య, 1992లో శోభిత జన్మించారు. పైగా శోభిత తెలుగు అమ్మాయి కావడం మరో విశేషం.

- Advertisement -

శోభిత కెరియర్..

శోభిత విషయానికి వస్తే.. వేణుగోపాలరావు, శాంతా దంపతులకు జన్మించిన ఈమె.. ముంబై యూనివర్సిటీ నుంచి హెచ్.ఆర్ కాలేజీలో కామర్స్ ఎకనామిక్స్ పూర్తి చేసింది. తెనాలికి చెందిన తన తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో చదువు పూర్తి చేయవలసి వచ్చిందట. క్లాసికల్ డాన్స్ లో కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్న ఈమె, 2013 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత 2016లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె అక్కడ మంచి పాపులారిటీ సొంతం చేసుకుని, ఇటీవలే తెలుగు చిత్రాలలో నటిస్తోంది శోభిత. ఇప్పుడు అందరూ ఊహించినట్లే నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే నాగచైతన్య రెండవ వివాహానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు