Nagababu: టార్గెట్ బన్నీ.? పోలింగ్ అయినంతవరకు నాగబాబు ట్వీట్ వేయకపోవడానికి కారణం అదేనా.?

Nagababu : మెగా ఫ్యామిలీ లో ఉన్న నటులలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. నాగబాబు వ్యక్తిత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో ఎవరిని ఏ మాట అన్నా కూడా టక్కున రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేది నాగబాబు మాత్రమే. గతంలో ఎన్నోసార్లు చాలామందికి దీటుగా, ఘాటుగా సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. మెగా బ్రదర్ నాగబాబుకి పవన్ కళ్యాణ్ పైన మెగాస్టార్ చిరంజీవి పైన ఎంత ప్రేమ ఉంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇకపోతే నాగబాబు మరోసారి ఒక విషయంపై స్పందించారు. మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మనకు తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొద్దిపాటి విభేదాలు ఉన్నాయంటూ చెబుతూ వస్తున్నారు. దీనికి కారణం గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని కామెంట్ చేయడం. పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరైతే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అది ఆ సినిమా ఫంక్షనా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఫంక్షనా అనేటట్లు ఉంటుంది.

పదేళ్ల ముందే ముందే మొదలు..

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడాడు అల్లు అర్జున్. అప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ని ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత సరైనోడు సినిమా టైంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పను అని అల్లు అర్జున్ చెప్పినప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ నెగిటివ్ అయ్యారు. ఆ కోపాన్ని దువ్వాడ జగన్నాథం సినిమా టీజర్ పైన కూడా చూపించి అత్యధిక డిస్ లైకులు కొట్టారు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చాలామంది పిఠాపురం వచ్చి ప్రచారం కూడా చేశారు. కొంతమంది ట్విట్టర్ వేదిక సపోర్టిస్తూ వచ్చారు. పాన్ ఇండియా సార్ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కి తన బెస్ట్ విషెస్ ను తెలియజేశారు. ఆ తరువాత తన స్నేహితుడి కోసం నంద్యాల వెళ్లి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి మద్దతు తెలిపారు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అసంతృప్తి చెందారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కి బెస్ట్ విషెస్ చెబుతూ వైసిపి కాండేట్ ను కలవడం అనేది చాలామందికి నచ్చలేదు.

Nagababu indirectly made a satirical statement on Allu Arjun

ఒకే ఒక్క ట్వీట్ తో..

ఇకపోతే ప్రస్తుతం నాగబాబు వేసిన ట్విట్ సంచలనానికి తెరతీస్తుంది. “మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైన మా వాడే” అని నాగబాబు ట్వీట్ ను వేశారు. అయితే ఈ ట్వీట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి వేశాడని కొంతమంది అంటున్నారు. దీనిలో వాస్తవం కూడా ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే మాతో ఉంటూ అనగానే మెగా ఫ్యామిలీతో ఎంతో అనుబంధంగా ఉంటాడు అల్లు అర్జున్, అయితే ప్రత్యర్థులకు పని చేయడమంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు కోసం మద్దతు తెలపడం అని చెప్పొచ్చు. అయితే దీనిపైన నాగబాబు స్పందిస్తే కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఆ ట్వీట్ పెట్టారు అని చెప్పలేము.

ఇక ఇంకొక విషయం ఏమిటంటే అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపి కాండేట్ ను కలిసిన రోజు ఇదే ట్వీట్ పెట్టి ఉంటే, ఆరోజు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కొంతమంది పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. వాళ్ల వలన కొంతమంది ఓటర్స్ ప్రభావితం కావచ్చు. అందుకోసమే పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ ట్వీట్ని చేశారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఎప్పుడో పెట్టాల్సిన ట్వీట్ ను లో లోపల చాలా బాధపడుతూ మొత్తానికి ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశారనేది కొంతమంది అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు