Nagarjuna : ఆ స్ట్రాటజీనే ఫాలో అవుతున్న నాగ్! ప్రతి సారి వర్కౌట్ అవుతుందా?

Nagarjuna : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో అందరూ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేసారు ఒక్క నాగార్జున తప్ప. కింగ్ నాగార్జున ఒకప్పుడు అందరికంటే బిజీగా వరుస సినిమాలు చేసేవాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు సినిమాలు చేసేవాడు. కానీ ఇప్పుడు ఒక సినిమా చేయడానికే బాగా టైం తీసుకుంటున్నాడు. తన తోటి సీనియర్ హీరోల్లా నిఖార్సైన సక్సెస్ లు ఈ మధ్య కాలంలో లేకపోవడం వల్ల మార్కెట్ కూడా తగ్గిపోయింది. ఇది ఒక కారణమైతే నాగ్ కు ఉన్న మిగతా బిజినెస్ లు, అలాగే బిగ్ బాస్ వంటి షోల ద్వారా, నాగార్జున కు టైం ఎక్కువ దొరకడం లేదని ఒక వాదన ఉంది. కానీ ఇప్పుడు త్వరలోనే స్పీడ్ పెంచనున్నాడట నాగార్జున.

Nagarjuna is following Na Sami Ranga strategy for the upcoming film

అదే స్ట్రాటజీ ఫాలో కానున్న నాగ్..?

ఇకపోతే ఈ ఇయర్ ‘నా సామి రంగ’ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చాడు నాగార్జున. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా నాగార్జునకు కం బ్యాక్ హిట్ వచ్చింది. ప్ర‌స్తుతం ధ‌నుష్ తో క‌లిసి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రంలో నటించాడు నాగ్. అయితే ఆ సినిమాలో నాగ్ కూడా మెయిన్ లీడ్ రోలా? లేక కీలకమైన పాత్ర మాత్రమే చేస్తున్నాడా అనేది తెలీదు. అయితే ఆ తర్వాత నాగార్జున సినిమా మాత్రం ఏది ప్రకటించలేదు. కానీ నాగార్జున ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడని అంటుంటే, కళ్యాణ్ కృష్ణ తో మళ్లీ చేస్తున్నాడు అని కొందరు నెటిజన్లు అంటున్నారు. అలాగే ఓ త‌మిళ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్నార‌నే ప్రచారం ఉంది. అయితే ఈ సారి సంక్రాంతిని కూడా వదలొద్దని నాగార్జున భావిస్తున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

అయితే సంక్రాంతికి 5 నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున నా సామి రంగ సినిమా స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడని తెలుస్తుంది. ఇంతకు ముందు నా సామి రంగను నాగార్జున కేవలం 3 నెలల్లోనే ఫినిష్ చేయడం తెలిసిందే. ఇప్పుడు కొత్త సినిమాని కూడా నాగార్జున ఉన్న ఐదు నెలల్లో ఫినిష్ చేసి సంక్రాంతికి తీసుకువద్దామని ప్లాన్ చేస్తున్నారట. కానీ దర్శకుడి విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

ఉన్న పరిస్థితుల్లో ఈసారి కూడా వర్కౌటవుద్దా?

అయితే నాగార్జునకి ఈసారి కూడా ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అంటే చెప్పలేము.. నా సామి రంగ రీమేక్ కాబట్టి, చిన్న లొకేషన్లలో సింపుల్ గా తక్కువ రోజుల్లో ఏదో అలా ఫినిష్ చేసారు. కానీ అలా ప్రతిసారి వర్కౌట్ కాదని అంటున్నారు నెటిజన్లు. పైగా బిగ్ బాస్ సీజన్ 8 కూడా వచ్చేస్తుంది. కానీ ఇప్పటివరకు దర్శకుడు ఎవరన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా కొత్త సినిమా మాత్రం సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తారని సమాచారం. మరి అదే స్ట్రాటజీ మళ్ళీ వర్కౌట్ అవుతుందా లేదా తెలియాలంటే ముందు నాగ్ నెక్స్ట్ సినిమాని అఫిషియల్ గా ముందు అనౌన్స్ చేయాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు