Nagarjuna Remuneration : రెమ్యూనరేషన్ డబుల్ చేసిన నాగ్… కూలీకి ఎంత వసూలు చేస్తున్నాడంటే?

Nagarjuna Remuneration : టాలీవుడ్ లో ఉన్న ఎవర్ గ్రీన్ హీరోలలో నాగార్జున కూడా ఒకరు. 60 ఏళ్లు దాటినా కూడా ఈ మన్మథుడు ఇంకా వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు. సినిమాల విషయంలోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నారు నాగ్. ప్రస్తుతం ఆయన హీరోగానే కాకుండా అతిధి పాత్రల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే అతిథి పాత్రలో నటించడానికి కూడా నాగ్ ఓ సక్సెస్ ఫుల్ మిడ్ రేంజ్ హీరో వసూలు చేసేంత రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు అనేది తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త.

కూలీకి ఎంత ఛార్జ్ చేస్తున్నాడంటే ?

ఇటీవలే తన 65వ పుట్టినరోజు జరుపుకున్న అక్కినేని నాగార్జున తన బ్లాక్‌బస్టర్ మూవీ ‘నా సామి రంగ’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అదే జోరును కంటిన్యూ చేస్తూ వరుస సినిమాలలో నటించడమే కాకుండా బిగ్ బాస్ తెలుగు హోస్ట్‌గా కూడా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. లెజెండరీ హీరో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నట్టు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

Image

- Advertisement -

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీలో శృతి హాసన్, సత్యరాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025లో విడుదల కాబోతున్న మోస్ట్ అవైటింగ్ తమిళ చిత్రాలలో ఒకటి. రజనీకాంత్‌ తో పాటు నాగార్జున ఈ సినిమాలో నటిస్తుండడంతో కూలీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో సైమన్ అనే డాన్ గా నాగార్జున కన్పించబోతున్నారు అంటూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం కూలీలో గెస్ట్ రోల్ కోసం నాగార్జున భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించినందుకు గానూ నాగార్జున ఏకంగా 24 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు ఇన్సైడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ భారీ రెమ్యునరేషన్ నాగార్జున స్టార్ పవర్, మార్కెట్ విలువను ఇంకా ఎంత స్ట్రాంగ్ ఉందో నిరూపిస్తోంది.

నాగ్ రెమ్యూనరేషన్ డబుల్

ఇటీవల కాలంలో హీరోగా నాగ్ చరిష్మా తగ్గిందనే చెప్పాలి. ఎప్పుడో ఏడాదికి ఒక హిట్ ను, లేదంటే అదీ లేదు అన్నట్టుగా ఉంది నాగ్ పరిస్థితి ప్రస్తుతం. ఇలాంటి తరుణంలోనే ఆయన సపోర్టింగ్ రోల్స్ వైపు మొగ్గు చూపడం విశేషం. అయితే హీరోగా తన కెరీర్లోనే తీసుకోనంత పారితోషికాన్ని ఆయన కూలీ మూవీకి అందుకుంటుండడం గమనార్హం.  సోలో హీరోగా 10 కోట్లకు మించి వసూలు చేయని నాగ్ ఈ సినిమాకు మాత్రం ఏకంగా 25 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటున్నారు. ఇంకా కుబేర సినిమాలోనూ ఆయన గెస్ట్ రోల్ లో కన్పించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నాగ్ 10 నుంచి 12 కోట్లు పారితోషికంగా అందుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ లెక్కన చూస్తే నాగ్ రెమ్యూనరేషన్ కూలీకి డబుల్ అయినట్టే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు