Nandamuri Kalyan Ram : అన్నయ్యకి ఫేం రావడం తారక్‌కి ఇష్టం లేదా? ఈ సలహా ఎందుకు ఇచ్చినట్టో…

Nandamuri Kalyan Ram : నందమూరి హీరోల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు.. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే.. తన సినిమాలను ప్రొడ్యూస్ చెయ్యడమే కాదు ఎన్టీఆర్ ప్రతి సినిమా ఈవెంట్ కు అన్న వచ్చి ప్రత్యేక అభినందనలు చెబుతూ ఉంటాడు.. అయితే వీరిద్దరి మధ్య ఇప్పటివరకు ఎటువంటి భేదాభిప్రాయాలు రాలేదు.. కనీసం గాసిప్స్ కూడా ఇప్పటివరకు రాలేదు.. కానీ తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..

అదేంటంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఓ సినిమా ఆఫర్ వచ్చేలా చేసినట్లు తెలుస్తుంది.. అందులో అంత వింతేముంది అనుకుంటున్నారా..? కానీ ఇదే ట్విస్ట్.. ఇప్పుడిప్పుడే అన్న కళ్యాణ్ రామ్ వరుస హిట్ సినిమాలతో బిజీ అవుతున్నాడు.. కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తున్నాడు.. అలాంటి సమయంలో ఎన్టీఆర్ కు సన్నిహితుడైన ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అన్నయ్య ఎదగడం ఎన్టీఆర్ కు ఇష్టం లేదా ఇలా ప్లాప్ డైరెక్టర్ తో సినిమాను చెయ్యడానికి ఒప్పుకున్నాడు అంటూ నందమూరి యాంటి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

Nandamuri fans allege that NTR is doing something wrong in the case of Kalyan Ram
Nandamuri fans allege that NTR is doing something wrong in the case of Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ మొన్నీమధ్య బింబిసారా సీక్వెల్ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా గతంలో భారీ విజయాన్ని అందుకోవడం ఆ సినిమాకు ప్రీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. అయితే ఈ సినిమాకు గతంలో వశిష్ఠ డైరెక్టర్ కాగా.. ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నారు. గతంలో అనిల్.. పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ తో రొమాంటిక్ అనే చిత్రం చేశారు.. ఆ సినిమా భారీ ప్లాప్ కాగా ఇప్పుడు అలాంటి డైరెక్టర్ తో ఈ సినిమాను తెరకేక్కించడం ఎంతవరకు కరెక్ట్ అని కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.. మరి ఈ కాంబో గురించి మరో అప్డేట్ ఇస్తారేమో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు