Nani Remuneration : ఇది నిజంగానే సరిపోతుందా…? రెమ్యునరేషన్ హైక్‌పై విమర్శలు తప్పవా..?

Nani Remuneration : టాలీవుడ్ యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ( Nani ) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తన నటనతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఏడాదికి రెండు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఏడాది హాయ్ నాన్న ( Hai Nanna) సినిమాతో హిట్ అందుకోగా, రీసెంట్ గా రిలీజ్ అయిన సరిపోదా శనివారం ( Saripoda Sanivaram ) సినిమాతో మరో హిట్ సినిమాను తన అకౌంట్ లో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు నాని రెమ్యూనరేషన్ పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు నాని ఎంత డిమాండ్ చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

హీరో నానికి బాగా పెరిగిపోయింది. వరుస హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకోవడం వల్ల ఇప్పుడు తర్వాత సినిమాలకు భారీగా డిమాండ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే సరిపోదా శనివారం మూవీకి 30 కోట్లు టాక్. ఇప్పుడు తర్వాత సినిమాలకు 40 కోట్లు అడుగుతున్నాడని టాక్. నాని ఇప్పటివరకు 20 నుంచి 25 కోట్ల వరకు మాత్రమే తీసుకున్నాడు. కానీ పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీకి 30 కోట్లు…అందులో కొంత ఇచ్చారు. మరి కొంత ఇవ్వడానికి డీవీవీ ఇప్పుడు రెడీగా లేడు. నెట్ ఫ్లిక్స్ నుంచి అమౌంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ రెమ్యునరేషన్ ఇస్తా అని దానయ్య చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

nani have increased the remuneration.. Will the producers give that much?
nani have increased the remuneration.. Will the producers give that much?

సరిపోదా శనివారం అనేది లక్..

ఆగస్ట్ 15న ఒక్క సినిమా హిట్ అయినా.. ఇప్పుడు సరిపోదా శనివారం తో పాటు ఏదైనా మంచి రిలీజ్ అయినా… ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు.. ఆడియన్స్ కి ఇది ఓ ఆప్షన్ అయింది. దీనితో పాటు ఏ ఒక్క సినిమా అయినా.. కొంచెం పాజిటివ్ వస్తే… ఈ మూవీ ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు రాబోయే వారం కూడా ఒక వేళ సినిమాలు హిట్ అవ్వకపోతే… సరిపోదాకి మరింత కలెక్షన్లు రావొచ్చు. కానీ, ఈ వారం గోట్ మూవీ ఉంది. ఇది 5 రోజు రిలీజ్ కాబోతుంది ఆ సినిమా హిట్ టాక్ ను అందుకుంటే మాత్రం దీని కలెక్షన్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా నాని మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నాడు. శ్రీకాంత్ ఓదెల,నాని కాంబోలో వస్తున్న మూవీకి 40 కోట్లు, ఆ తర్వాత రాబోతున్న సినిమాలకు కూడా అంతే అని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాతలు అంత సమర్పించుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు