Nani : సాధారణంగా ఫ్యాన్స్ పెట్టాలి… కానీ, హీరో గారే కానిచ్చేసారు

Nani : ప్రముఖ దర్శకులు బాపు(Bapu) గారి దగ్గర రాధాగోపాలం(Radha Gopalam) సినిమాకి శిష్యరికం చేశాడు నాని. ఇంద్రగంటి మోహనకృష్ణ(Indraganti Mohan Krishna) దర్శకత్వం వహించిన అష్టాచమ్మా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కథలను ఎంచుకుంటూ మంచి పేరును సాధించుకున్నాడు. నాని కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. నాని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అంచలంచెలుగా ఎదిగి నేడు తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. నాని సినిమా అంటే ప్రత్యేకంగా ఉంటుంది అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యే ఆడియన్స్ కూడా ఉన్నారు.

ఇకపోతే నానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే మాట వాస్తవమే. అయితే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కేవలం ఫస్ట్ డే ఫస్ట్ షో కి టికెట్ కొని చూడడానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ నానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూ లేరు అని చెప్పాలి. ఇక అసలైన ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే కొన్ని రోజుల ముందు నుంచే హడావిడి చేస్తారు. తమ సినిమా గురించి నెగిటివ్ టాక్ వస్తే డిఫెండ్ చేస్తారు.

కొందరు అభిమానులు ఆ హీరో సినిమా రిలీజ్ రోజు పెద్దపెద్ద బ్యానర్లు కడుతూ ఉంటారు. ఇంకా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అతి పెద్ద కటౌట్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. అయితే ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో నానికి సంబంధించిన అతి పెద్ద కటౌట్ అక్కడ దర్శనమిస్తుంది. అయితే ఆ కటౌట్ నాని కట్టించుకున్నాడు అని సమాచారం వినిపిస్తుంది.

- Advertisement -

Saripodha Sanivaram

ఇకపోతే వివేక్ ఆత్రేయ(Vivek Athreya) దర్శకత్వంలో వస్తున్న సరిపోదా శనివారం సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే వీరి కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ సినిమా సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికి ఆ సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేదు కాబట్టి ఒక యాక్షన్ ఫిలిం తో మొదటిసారి తన పంథాను మార్చుకున్నాడు దర్శకుడు వివేక్. ఒక క్లాస్ డైరెక్టర్ కంప్లీట్ యాక్షన్ ఫిలిం తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నాం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు