Nani role in Kalki : నాని ఫ్యాన్స్ కు నాగీ మామ షాక్… నేచురల్ స్టార్ పాత్రను డిలీట్ చేశారా?

Nani role in Kalki : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు కల్కి పండుగ రోజు రానే వచ్చింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లన్నీ కల్కి 2898 ఏడి మూవీ ఫీవర్ తో దద్దరిల్లిపోతున్నాయి. వెండితెరపై ఒక్కొక్కరి పాత్ర ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. నాగ్ అశ్విన్ నడిపించిన కథ, కథనం అద్భుతంగా ఉండగా, ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్లు షేక్ అవుతున్నాయి. సినిమా అయిపోయినప్పటికీ ట్రాన్స్ నుంచి బయట పడలేకపోతున్నాం అంటున్నారు ప్రేక్షకులు. అయితే ఈ నేపథ్యంలోనే నాని అభిమానులు మాత్రం నిరాశలో మునిగిపోయారు. వాళ్ళు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేసిన నాని పాత్ర సినిమాలో కనిపించకపోవడంతో కంగుతిన్నారు. మరి నాని పాత్రను కల్కి 2898 నుంచి నాగి మామ డిలీట్ చేశాడా?

నాని పాత్ర ఎక్కడ నాగి మామా ?

కల్కి మూవీలో మొదటి నుంచి ప్రభాస్ హీరోగా, అశ్వద్ధామగా అమితాబ్, దిశా పటాని, దీపిక పదుకొనే, కమల్ హాసన్ వంటి ప్రధాన పాత్రల గురించి మాత్రమే ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. అయితే సినిమాలో ప్రేక్షకులకు తెలియని సీక్రెట్స్ ఎన్నో పెట్టారు డైరెక్టర్ నాగ్  అశ్విన్. అందులో భాగంగానే పలువురు సూపర్ స్టార్స్ కూడా కొన్ని కీలకపాత్రలు పోషించారు. కానీ వాటిని వెండితెరపై మాత్రమే రివీల్ చేయాలనే ఉద్దేశంతో నాగి ఎక్కడా వాళ్ల గురించి ప్రస్తావించలేదు. అయితే ఈ సినిమాలో నటించబోయే స్టార్స్ వీళ్లేనంటూ పలువురి హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్ల పాత్రల గురించి జోరుగా ప్రచారం నడిచింది. అందులో నాని పేరు కూడా వినిపించింది. తాజాగా నాని కల్కి గురించి స్పెషల్ ట్వీట్ చేయడంతో ఈ సినిమాలో నాని పాత్ర పక్కా అని ఫిక్స్ అయిపోయారు. కానీ నాగి మామ నాని ఫాన్స్ కు షాక్ ఇచ్చాడు.

Kalki 2898 AD: Part 2, VD, Prabhas' Entry & Many moreనాని స్పెషల్ ట్వీట్

ఇంటర్నేషనల్లి స్లిక్ కంటెంట్ ఓరియెంటెడ్ పౌరాణిక భవిష్యత్ సైన్స్ ఫిక్షన్ మాస్ ఇండియన్ ఫిల్మ్ తెలుగు ల్యాండ్ నుండి ఎప్పుడైనా చూసారా ? నాగి, ప్రభాస్ అన్న, వైజయంతి సినిమాస్, ఇతర స్టార్‌కాస్ట్‌లు తీసినందుకు గర్వంగా కల్కి 2898 ఏడీ మూవీని చూడండి అంటూ నాని ట్వీట్ చేశారు. దీంతో సినిమాలో ఆయన ఉన్నాడా? లేదా ? అనే డౌట్ మొదలైంది. అయితే ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయ్యింది. 
నాని పాత్రను డిలీట్ చేశారా?

థియేటర్లలో సినిమా మొత్తం చూసినప్పటికీ ఎక్కడా నాని పాత్ర కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. నేచురల్ స్టార్ కచ్చితంగా ఏదో ఒక కీ రోల్ పోషించి ఉంటాడని ఊహించిన నాని ఫ్యాన్స్ కి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. దీంతో కల్కి 2898 మూవీలో నాని పాత్రను డిలీట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ నాని కల్కిలో సినిమాలో ఎందుకు లేడు? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎట్టకేలకు ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించే మూవీ పడినందుకు ఖుషీగా ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు