HIT3 : ఎట్టకేలకు సీక్వెల్ కి టైం ఫిక్స్ అయింది.. కానీ డైరెక్టర్ రెడీయా?

HIT3 : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉండగా, లాస్ట్ ఇయర్ రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ లు కొట్టగా, ఇప్పుడు సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) తో హ్యాట్రిక్ సక్సెస్ ని కొట్టడానికి రెడీ అయ్యాడు. ఇదిలా ఉండగా నాని ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయనున్నాడన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో ఉంది. అయితే దీని తర్వాత నాని సుజీత్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేయాల్సి ఉంది. కానీ పవన్ ఓజి స్టార్ట్ చేస్తే ఈ సినిమా హోల్డ్ లో ఉంటుంది. సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది. ఇక బలగం వేణు తో ప్రాజెక్ట్ వేరే హీరో చేతుల్లోకి వెళ్ళిపోయింది. దాంతో నాని తర్వాత ప్రాజెక్ట్ ఏమై ఉంటుందా అని వార్తలు వస్తుండగా, తాజాగా నాని (Nani) క్రేజీ సీక్వెల్ కి ముహూర్తం ఫిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి.

Nani-Sailesh Kolanu HIT3 Movie Update

సీక్వెల్ కి రంగం సిద్ధం..

తాజాగా నాని అదిరిపోయే సీక్వెల్ లో నటించనున్నాడని సమాచారం. ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను ‘హిట్’ సినిమాల యూనివర్స్ లో భాగంగా త్వరలో హిట్3 ప్రారంభం కానుందని తెలుస్తుంది. ఇక హిట్2 వచ్చినప్పుడే అందులో హిట్3 (HIT3) లో అర్జున్ సర్కార్ గా నాని ఎంట్రీ ఇస్తున్నాడని అనౌన్స్ చేసారు. కానీ ఈ ప్రాజెక్ట్ నాని చేస్తున్నఇతర సినిమాల వల్ల హోల్డ్ లో పడింది. ఇక ఇప్పుడు తొందర్లోనే హిట్3 మొదలవుతుందని సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం హిట్3 ప్రాజెక్ట్ గురించి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అఫిషియల్ గా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉండగా, సెప్టెంబర్ రెండో వారం నుండి సినిమా మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

డైరెక్టర్ రెడీయా?

అయితే హిట్3 సినిమా కి డైరెక్టర్ శైలేష్ కొలను (Sailesh Kolanu) రెడీ అయ్యాడా లేదా అన్న డౌట్ ఫాన్స్ కి వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా శైలేష్ కొలను డెంగ్యు ఫీవర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ ఫీవర్ నుండి ఇంకా కోలుకోలేదని సమాచారం. అప్పటివరకు పూర్తిగా రికవరీ అయితేనే షూట్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే మరో రెండు వారాలు ముందుకు జరిపే ఛాన్స్ ఉంది. ఇక హిట్ పార్ట్ 1,2 రెండు కూడా మంచి సక్సెస్ సాధించగా, హిట్3 ని నాని స్వయంగా నిర్మించనున్నట్టు టాక్. ఇక ఈ హిట్3 లో కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు