Narthan: చరణ్ పెండింగ్, విజయ్ దేవరకొండ ఫినిష్

చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే చిరు తనయుడు అనిపించుకుని తనదైన స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నాడు. చిరుత సినిమా తర్వాత చేసిన చరణ్ మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ హిట్ కొట్టాడు. చరణ్ ని మగధీర సినిమా తీసుకెళ్లి శిఖరం మీద కూర్చుని పెట్టింది. ఆ తర్వాత చరణ్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అంచనాలు రెట్టింపడం మొదలయ్యాయి.

మగధీర తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా ఆరెంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. పర్మినెంట్ లవ్ అంటూ ఉండదు అని జెన్యూన్ ఫ్యాక్ట్ ని రిఫ్లెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రీసెంట్గా రీ రిలీజ్ చేసినప్పుడు ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. భాస్కర్ ను ఆరెంజ్-2 తీయండి బ్రహ్మరథం పడతాం అని చెప్పిన ఆడియన్స్ కూడా ఉన్నారు.

ఇకపోతే మగధీర తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాగానే ఆడాయి. ఎవడు, నాయక్,రచ్చ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకున్నాయి. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమా రామ్ చరణ్ కి మంచి హిట్ గా నిలిచింది. అక్కడి నుంచి రాంచరణ్ కెరియర్ కి తిరుగలేదు అన్నట్లు జరిగింది.

- Advertisement -

రామ్ చరణ్ కెరియర్ గురించి మాట్లాడుకుంటే రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అని చెప్పొచ్చు. మగధీర సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు కొట్టినా కూడా, రంగస్థలం సినిమాతో రాంచరణ్ కి వచ్చిన పేరు మాత్రం మామూలు కాదు అని చెప్పొచ్చు. అసలు రామ్ చరణ్ లో ఈ రేంజ్ నటుడు ఉన్నాడా అని అందర్నీ ఆశ్చర్యపరిచిన సినిమా రంగస్థలం.

రంగస్థలం తర్వాత చేసిన సినిమా “వినయ విధేయ రామ” ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించిన రామ్ చరణ్ ఈ సినిమాతో ఎక్కడికో ఎదిగిపోయాడు అని చెప్పొచ్చు.

ఇకపోతే ఈ ప్రాజెక్ట్ తర్వాత రామ్ చరణ్ ఇద్దరు డైరెక్టర్లతో సినిమాలు చేయాల్సి ఉంది. ఒకటి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయాల్సి ఉంది రామ్ చరణ్. ఈ సినిమాని అనౌన్స్మెంట్ కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో ఇదే ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు.

కన్నడ డైరెక్టర్ నర్తన్ తో కూడా రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. మఫ్టీ సినిమాను తెరకెక్కించిన నర్తన్, రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశాడు. అయితే ఆ కథతో కొన్ని చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం అదే కథను చరణ్ హోల్డ్ లో పెట్టాడని, అదే కథ విజయ్ దేవరకొండ తో నర్తన్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చరణ్ ఆపిన ప్రాజెక్టులను విజయ్ దేవరకొండ చేస్తున్నాడు అంటే, విజయ్ జడ్జిమెంట్ ఎంతవరకు కరక్ట్ అనేది ఆయా సినిమాలు రిలీజ్ అయితే కానీ తెలియదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు