Love Mouli : లవ్ మౌళి లో టైటానిక్ ఫేమస్ సీన్ రిపీట్..?

Love Mouli : టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా నటించిన సినిమా “లవ్ మౌళి”. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్ కి రెడీ అవుతుంది. కాగా ఈ సినిమా రీలీజ్ సందర్బంగా చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూ లలో ప్రమోషన్లలో పాల్గొంటూ సినిమాపై బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వినూత్నమైన చిత్రాలకు అడ్డా అయిన సీ స్పేస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందగా, నవదీప్ 2.0 సెకండ్ ఇన్నింగ్స్ అంటూ లవ్ మౌళి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే లవ్ మౌళి (Love Mouli) మూవీలో నవదీప్ పెయింటర్ గా కనిపించనున్నట్లు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది. అయితే మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అలాగే మూవీలో కూడా అనేక బోల్డ్ సీన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా 2 గంటల 25 నిమిషాల రన్ టైమ్ తో ఉంటుందని సమాచారం.

Navdeep copied the titanic romantic scene in Love Mouli movie

సినిమాలో ఏకంగా 42 కిస్ సీన్లు…

అయితే త్వరలో రిలీజ్ కాబోతున్న లవ్ మౌళి మూవీ ట్రైలర్ లోనే ఏకంగా ఏడు లిప్ కిస్ సీన్లు ఉన్నాయి. ఈ సినిమాలో అలాంటి సీన్లు ఎన్నో ఉన్నాయట. అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీలో 25కి పైగా లిప్ కిస్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు లవ్ మౌళి చిత్రం. 42 లిప్ లాక్స్ తో అర్జున్ రెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో ఓ హాలీవుడ్ మూవీ ఐకానిక్ రొమాంటిక్ సీన్ ని కూడా కాపీ చేసారని సమాచారం.

- Advertisement -

టైటానిక్ సీన్ రిపీట్..

ఇక హాలీవుడ్ ఎవర్ గ్రీన్ మూవీ టైటానిక్ లో హీరోయిన్ న్యూ*డ్ గా ఉంటే.. హీరో పెయింటింగ్ వేసిన సీన్ గుర్తుందా? మూడు నిమిషాలకు పైగా ఉన్న ఆ సీన్ లాంటి సన్నివేశం మళ్ళీ లవ్ మౌళిలో రీ క్రియేట్ చేసారని సమాచారం. అయితే అందులో ఉన్నంత బోల్డ్ గా ఈ సీన్ ఉంటుందా లేదా అన్నది తెలీదు. ఇక ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ డైలాగులు కూడా ఉన్నాయని సమాచారం. బోల్డ్ సీన్స్ లో వచ్చే ఆ డైలాగులకు థియేటర్లలో ఈలలు వేయడం పక్కా అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. సీ స్పేస్, నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. నవదీప్ సరసన పంఖురి గిద్వానీ నటిస్తోంది. గోవింద వసంత క్రేజీ మ్యూజిక్ అందించారు. నిజానికి ఈ చిత్రం షూటింగ్ మూడు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కానీ అనేక కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక హీరోగా హిట్ కొట్టి ఎన్నో ఏళ్లయిన నవదీప్ ఈ సారి లవ్ మౌళి సినిమాతో హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు