Naveen Polishetty: జాతి రత్నాలు హీరోకు వింత జబ్బు… అందుకే సినిమాలు చేయట్లేదా?

Naveen Polishetty : మంచి క్రేజ్ తో పాటు మార్కెట్ ఉన్న టైర్ 2 తెలుగు హీరోలలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు. అయితే చాలాకాలంగా ఆయన సినిమాలు చేయకపోవడంతో నవీన్ పోలిశెట్టి స్పాంటేనియస్ ఫన్ ను మిస్ అవుతున్నారు టాలీవుడ్ మూవీ లవర్స్. అయితే ఈ హీరో సినిమాలు చేయకపోవడం వెనక కారణం ఓ వింత జబ్బు అని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ హీరోను సినిమాలు చేయకుండా ఆపుతున్న జబ్బు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నవీన్ పోలిశెట్టికి ఆ వింత జబ్బు

దాదాపుగా గత ఏడాది కాలంగా నవీన్ పోలిశెట్టి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఎందుకంటే ఆయనకు వింత జబ్బు ఉందని నవీన్ సన్నిహితులు చెబుతున్న మాట. ఈ హీరోకు ఫెయిల్యూర్ ఫోబియా అనే జబ్బు ఉందట. అంటే ఏ సినిమా చేసినా హిట్ కొట్టి తీరాల్సిందే. లేదంటే ఎక్కడ కెరీర్ ఆగిపోతుందో అనే భయం, సినిమాలు ప్లాప్ అవుతాయేమోనని టెన్షన్ ఉంటుందట. ఈ ఫోబియా కారణంగానే నవీన్ పోలిశెట్టి ఇప్పటి వరకు ఎన్నో కథలు విన్నప్పటికీ ఒక్క సినిమాను కూడా ఓకే చేయలేదని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ఇండియాలో కాకుండా అమెరికాలో ఉన్నాడని అంటున్నారు ఆయన సన్నిహితులు. కొంతకాలం క్రితమే అమెరికాలో నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్ అయిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Power to audience', says Naveen Polishetty after Jathi Ratnalu's SIMA  windfall - News - IndiaGlitz.com

- Advertisement -

కామెడీ కింగ్ నవీన్ పోలిశెట్టి…

సాధారణంగా హీరోలు అనగానే మాక్సిమం కమర్షియల్ అంశాలు, హీరో ఎలివేషన్స్ సీన్స్ ఉండే సినిమాలతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంటారు. కానీ నవీన్ పోలిశెట్టి మాత్రం అందరికంటే డిఫరెంట్ అని చెప్పొచ్చు. మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే కామెడీ థ్రిల్లర్ తోనే 2019లో హిట్ అందుకున్నాడు. అందులో నవీన్ కామెడీ టైమింగ్ కు పేక్షకులు ఫిదా అయ్యారు. అదే ఏడాది బాలీవుడ్లో చిచోరా మూవీలో కీలక పాత్రను పోషించి, అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. 2021 లో జాతి రత్నాలు సినిమాతో సైమా ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు. ఇందులోని హిలేరియస్ కామెడీని నవీన్ అద్భుతంగా పండించాడు.

ఆ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చి 2023లో అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాను చేశాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇలా తన ప్రతి సినిమాలో ప్రత్యేకమైన కామెడీతో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు నవీన్ పొలిశెట్టి. అలాంటిది ఈ హీరో ఫెయిల్యూర్ ఫోబియా కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు అనే వార్త ఆయన అభిమానులను నిరాశ పరుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది నవీన్ పోలిశెట్టి స్పందిస్తేనే తెలుస్తుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే నవీన్ పోలిశెట్టి రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా ఎక్కడా స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆయన యాక్టివ్ గా లేకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు