Naveen Polishetty: రహస్యంగా నవీన్ పోలిశెట్టి పెళ్లి..!

Naveen Polishetty.. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది అందరికీ చెప్పి బహిరంగంగా వివాహం చేసుకుంటుంటే, మరికొంతమంది రహస్యంగా వివాహం చేసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టాండ్ అప్ కమెడియన్ గా పేరు తెచ్చుకొని, ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలు చేసి హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఒక్క సినిమాతో తనదైన మాట నటనతో యువతకు దగ్గరై పోయారు. ఏ కథ దొరికితే ఆ కథ చెయ్యకుండా మంచి సినిమా కథ కోసం ఎదురు చూసి.. ఆ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు తన ఖాతాలో విజయాలను కూడా వేసుకుంటున్నాడు.. ఆయన ఎవరో కాదు నవీన్ పోలిశెట్టి.

Naveen Polishetty: Naveen Polishetty married secretly..!
Naveen Polishetty: Naveen Polishetty married secretly..!

రహస్యంగా పెళ్లి చేసుకున్న నవీన్..

అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. అదేమిటంటే నవీన్ పోలిశెట్టి రహస్యంగా వివాహం చేసుకున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న నవీన్ పోలిశెట్టి అక్కడే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఇది జరిగి చాలా నెలలు అవుతుందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇకపోతే చాలా రోజుల తర్వాత నవీన్ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.. సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల సమయంలో అమెరికా వెళ్లిన ఆయన ఇప్పటికీ తిరిగి రాలేదు. పైగా ఒక చిన్న ప్రమాదం కూడా జరిగింది. చేయికి దెబ్బ తగిలిందని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఇప్పటికీ చేతికి కట్టుతోనే ఉంటున్నాను అని మొన్నా మధ్య ఒక వీడియో కూడా వదిలాడు.

సడన్ గా ఫిలింఫేర్ అవార్డు వేడుకల్లో దర్శనం..

అయితే చడీ చప్పుడు కాకుండా చటుక్కున ఫిలింఫేర్ అవార్డు వేడుకల్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు నవీన్ పోలిశెట్టి. అయితే అలా కనిపించారో లేదో అప్పుడే అదృశ్యం అయిపోయారు. మరి ఇప్పుడు ఆయన అమెరికా వెళ్లారా ? లేక ముంబై వెళ్లారా? అన్నది మాత్రం తెలియదు. కానీ ప్రస్తుతం ఈయనకు పెళ్లి జరిగిందని అందుకే వెంటనే భార్య దగ్గరకు వెళ్లిపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

- Advertisement -

పెళ్లి పై క్లారిటీ..

అయితే ఈ వార్తలు అలా వచ్చాయో లేదో అప్పుడే నవీన్ పోలిశెట్టి స్పందించినట్లు సమాచారం .నవీన్ పోలి శెట్టి ఈ విషయంపై స్పందిస్తూ.. కెరియర్ లో బాగా సెటిల్ అయిన తర్వాతే పెళ్లి అని, ఇది కేవలం రూమర్ మాత్రమే అని కొట్టి పారేశారు. అంతే కాదు పెళ్లి చేసుకుంటే ముందుగా మీడియాకే చెబుతానని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మూడు స్క్రిప్టులు రెడీ అవుతున్నాయని, తదుపరి దృష్టి అంతా వాటిపైనే అని తెలిపారు నవీన్. ఏది ఏమైనా నవీన్ కి సంబంధించిన ఈ పెళ్లి వార్త మాత్రం అభిమానులను పూర్తిస్థాయిలో ఆశ్చర్యపరుస్తోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు