Nazriya: హీరోయిన్ నజ్రియా ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

Nazriya: టాలీవుడ్, మాలీవుడ్ లో హీరోయిన్ నజ్రియా నజీమ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. అమాయకత్వంతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దక్షిణాది ఆడియన్స్ ని ఫిదా చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆర్య నటించిన రాజా రాణి చిత్రంతో మరింత పాపులారిటీ అందుకున్నది. భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలలో నటించిన నజ్రియా.. తెలుగులో చివరిగా నాని నటించిన “అంటే సుందరానికి” అనే సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి మరీ నటించింది. ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గానే ఉంటూ తన కుటుంబానికి, తనకు సంబంధించి ప్రతి విషయాన్ని షేర్ చేస్తూనే ఉంటుంది.

Nazriya: Do you know the price of this watch worn by heroine Nazriya?
Nazriya: Do you know the price of this watch worn by heroine Nazriya?

మీరా నందన్ పెళ్లిలో నజ్రియా స్పెషల్ అట్రాక్షన్..

నజ్రియా భర్త కూడా హీరోగా , విలన్ గా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు ఫహద్ ఫాజిల్. ప్రతి పాత్ర కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా నటిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడు నజ్రియాకు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.. అదేమిటంటే.. ప్రముఖ మలయాళ హీరోయిన్ మీరానందన్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ హీరోయిన్ పెళ్లికి మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలామంది సెలబ్రిటీలు కూడా పాల్గొనడం జరిగింది. అందులో హీరోయిన్ నజ్రియా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.

అందర్నీ ఆకట్టుకున్న నజ్రియా చేతి వాచ్..

తన భర్త ఫహద్ ఫాజిల్ తో కలిసి పెళ్లికి హాజరయిన నజ్రియా అందరి దృష్టి తన వైపు మళ్ళేలా చేసింది.. గులాబీ రంగు చీరలో సింపుల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. తన చేతికి ధరించిన వాచ్ మాత్రం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. ముఖ్యంగా నజ్రియా ధరించినటువంటి ఈ వాచ్ ధర తెలుసుకోవడం కోసం అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. అయితే నజ్రియా చేతికి ఉన్న వాచ్ విషయానికి వస్తే.. రోలెక్స్ డేటే జస్ట్ 36 మోడల్ అన్నట్లుగా తెలుస్తోంది.. పాలిష్ చేయబడినటువంటి ఈ వాచ్ 18k పసుపు బంగారంలో కలిగినటువంటిదట.

- Advertisement -

ఈ వాచ్ ధర అక్షరాలా.. రూ.11,84,419..

ఈ వాచ్ ధర విషయానికి వస్తే .. రూ.11,84,419 రూపాయలు అన్నట్లుగా తెలుస్తోంది. ఈ వాచి ధర తెలిసి ఒకసారిగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వివాహం తర్వాత నజ్రియా ఎక్కువగా సినిమాలలో కనిపించడం లేదు.. కేవలం తన కూతురితో లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.. అయితే నటిగా కాకుండా నిర్మాతగా కూడా నజ్రియా ఈ మధ్యకాలంలో పలు సినిమాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఫ్రీ అంటే ఇచ్చిన ఆ సినిమా సక్సెస్ కావడంతో మరి ఎక్కడ కనిపించలేదు ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె భర్త ఫహద్ ఫాజిల్ మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2 చిత్రంలో విలన్ గా నటించబోతున్నారు మరి ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈయనకు ఎలాంటి గుర్తింపు అందిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు