NBK 50 Years Event : NBK గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ పై పవన్ పునరాలోచన… బాలయ్యకు షాక్ తప్పదా..?

NBK 50 Years Event.. స్వర్గీయ నందమూరి తారక రామారావు(NTR ) స్వీయ దర్శకత్వంలో 1974 లో వచ్చిన తాతమ్మకల (Tatamma kala) అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యారు నందమూరి బాలకృష్ణ (Balakrishna ). ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈయన , హీరోగా మారి సత్తా చాటుతున్నారు. ఇకపోతే నేటికి ఈయన సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీన సినీ పరిశ్రమ ఘనంగా గోల్డెన్ జూబ్లీ నిర్వహించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం సినీ పెద్దలు, రాజకీయ నాయకుల సమక్షంలో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు.

NBK 50 Years Event : Pawan Rethinks on NBK Golden Jubilee Event... A Shock for Balayya?
NBK 50 Years Event : Pawan Rethinks on NBK Golden Jubilee Event… A Shock for Balayya?

బాలయ్య ఈవెంట్ కి తరలివస్తున్న మహారధులు..

టాలీవుడ్ ను మొదలుకొని బాలీవుడ్ వరకు ప్రతి సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే మెగా హీరోలతో పాటు అల్లు హీరోలు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ , విజయ్ సేతుపతి , శివరాజ్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కమల్ హాసన్ , అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ హీరోలతో పాటు తెలుగు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. అంతేకాదు సినీ వ్యాపార రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా రాబోతున్నారు.

బాలయ్య కార్యక్రమానికి పవన్ పునరాలోచన..

రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానం అందింది. అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి కూడా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. మరి ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వస్తారా? రారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి వస్తున్నాడు. అందుకే రావట్లేదు అనే వార్త వినిపిస్తున్నా మరొకవైపు పిఠాపురంలో శ్రావణ లక్ష్మి వ్రత సందర్భంగా అక్కడి మహిళలకు పసుపు, కుంకుమ, చీర వంటి సారే అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన ఎటువైపు మొగ్గు చూపిస్తారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాకపోతే బాలకృష్ణకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు.

- Advertisement -

రాజకీయంగా పవన్ కళ్యాణ్ బిజీ..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి రావాలా వద్దా అని ఆయన పుణరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తారా లేదా అనే విషయం తెలియాలి అంటే సెప్టెంబర్ ఒకటి సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.

అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్న బాలయ్య..

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే, 100 సంవత్సరాల సినీ కెరియర్లో ఏకంగా అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్నారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి గానూ సినీ పెద్దలు ఇలా గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఆహ్వానం అందిన మేరకు ఎవరెవరు ఈ కార్యక్రమానికి రాబోతున్నారో తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు