NBK-Rapo : తెరపైకి ఊహించని క్రేజీ కాంబో..సెట్టయ్యేనా?

NBK-Rapo : టాలీవుడ్ లో ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు చాలా వచ్చేవి. స్టార్ హీరోలు తమ స్టార్ డమ్ ని పక్కన పెట్టి పాత్ర బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేయడానికి సిద్ధపడేవారు. కానీ 90స్ తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. ఇక దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెరపైకి సమానమైన స్టార్ డమ్ ఉన్న హీరోలు నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా తర్వాత మల్టి స్టారర్ లకి డిమాండ్ బాగా పెరిగింది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు పూర్తి స్థాయిలో కాకపోయినా, కీ రోల్స్ అయినా చేస్తున్నారు. ఇక లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య లో చిరు – రవితేజ కాంబో ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ ని ఇచ్చింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఒక ఊహించని కాంబో సెట్టయిందని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

NBK - Ram Pothineni combo under Mythri movie makers

ఎన్బీకే – రాపో పవర్ ఫుల్ కాంబో…

ఇక టాలీవుడ్ లో కొన్ని రోజుల నుండి ఒక క్రేజీ కాంబోపై చర్చ నడుస్తుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ – రామ్ పోతినేని (NBK-Rapo) కాంబినేషన్ లో టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో మల్టి స్టారర్ సినిమా వస్తుందని బజ్ నడుస్తుంది. ఇక సీనియర్ స్టార్ హీరో అయిన బాలయ్య ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తుండగా, రామ్ పోతినేని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య – రామ్ తో ప్రతిష్టాత్మకంగా సినిమాని నిర్మిస్తున్నారని సమాచారం. ఇక ఈ కాంబో సినిమాని బోయపాటి శ్రీను, లేదా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్..

- Advertisement -

రిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య – రామ్ సినిమాలు..

ఇక బాలకృష్ణ, రామ్ పోతినేని  కాంబో సినిమా కోసం స్కంద ఈవెంట్ లో వీళ్ళిద్దరూ కలిసినప్పటి నుండి చర్చలు జరుగుతున్నాయట. ఇప్పటికీ కథ సెట్ అయిందని టాక్. మరి ఈ కాంబో పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబీ తో చేస్తున్న సినిమా సంక్రాంతి కి రాబోతుండగా, యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ మరో రెండు వారాల్లో ఆగష్టు 15న రిలీజ్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు