2025 Sankranthi : సంక్రాంతి రేసు నుంచి చిరు ఔట్… బాలయ్య ఇన్

2025 Sankranthi

2025 సంక్రాంతి పై టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పటినుంచి కర్చీఫ్ వేసేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ డేట్ ను ప్రకటించి తన సినిమా వయసులో ఉండబోతుందనే విషయాన్ని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ తాజా సమాచారం వచ్చే సంక్రాంతి సినిమాలో ఊహించని ట్విస్ట్ రాబోతోంది. ఈ రేసులో నుంచి చిరు ఔట్, బాలయ్య ఇన్ కాబోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ ఫాంటసీ డ్రామా “విశ్వంభర”. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాదులో వేసిన 13 భారీ సెట్స్ లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే “విశ్వంభర” మూవీ అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

ఈ మూవీ సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతోంది. కాబట్టి షూటింగ్ కంటే ఎక్కువగా వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుంది. ప్రస్తుతం ఇంకా సినిమా రిలీజ్ డేట్ కు 11 నెలలు మాత్రమే మిగిలి ఉండగా, వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు చిత్ర బృందం. అయితే ఒకవేళ షూటింగ్ త్వరగా పూర్తయినా, వీఎఫ్ఎక్స్ వర్క్ కు మాత్రం చాలా టైం పడుతుంది. కాబట్టి వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా అనుకున్న సమయానికి “విశ్వంభర” మూవీని రిలీజ్ చేయడం కష్టమని సమాచారం. దీంతో “విశ్వంభర” మూవీ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మరోవైపు బాలయ్య సంక్రాంతి రేసులోకి రావడానికి రెడీగా ఉన్నారట.

- Advertisement -

ప్రస్తుతం బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్య దేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో “వైలెన్స్ కి విజిటింగ్ కార్డు” అంటూ మేకర్స్ పెట్టిన క్యాప్షన్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేసింది.

NBK109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే డైరెక్టర్ బాబి ఫుల్ జోష్ లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు. పైగా ఈ మూవీ వీఎఫ్ఎక్స్ కు కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా పెద్దగా టైం తీసుకోదు. కాబట్టి NBK109 మూవీనీ 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నాగ వంశీ ప్లాన్ చేస్తున్నారని టాక్.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు