Nbk109: బాలయ్య సినిమాకు సెంటిమెంట్ డేట్

Nbk109: నందమూరి నటసింహం బాలయ్య బాబు(Nandamuri Balakrishna) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో బాలయ్య ఒకరు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయనని ఎక్స్పరిమెంటల్ ఫీలింగ్స్ బాలకృష్ణ చేశారు. వైవిద్యమైన కథలకు స్వాగతం పలికారు. అయితే ఒక టైం లో మాస్ కమర్షియల్ సినిమాలు చేయటం మొదలుపెట్టారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణ ఎంతటి ఫామ్ లో ఉన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మధ్యకాలంలో వరుస డిజాస్టర్లు తో సతమతమవుతున్న టైంలో అఖండ(Akhanda) సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుని ఇప్పుడు వరుస హిట్ సినిమాలను చేస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది గెస్ట్ లు ఈ షో కి హాజరయ్యారు. ఈ షో కి హోస్ట్ నందమూరి బాలకృష్ణ అని చెప్పినప్పుడు చాలామంది అనేక విమర్శలు చేశారు. అసలు బాలకృష్ణ హోస్ట్ ఏంటి అని అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచారు బాలయ్య. బాలయ్య నిజమైన వ్యక్తిత్వం ఏంటో ఈ షో ద్వారా బయటపడింది. బాలయ్య ఎదుటివారిని ఎలా గౌరవిస్తారో ఎంత సరదాగా మాట్లాడుతారు ఈ షో చూసిన తర్వాత అర్థమైంది.

వరుస హిట్ సినిమాలు

బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్(SS Thaman) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను బీభత్సంగా ఎలివేట్ చేసింది. ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత వరుస హిట్ సినిమాలు బాలయ్య కెరియర్ లో పడ్డాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన వీర సింహారెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంతు కేసరి సినిమా కూడా మంచి ఫలితాన్ని నమోదు చేసుకుంది.

- Advertisement -

NBK 109

సెంటిమెంట్ డేట్ కు

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ 109వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2వ తారీఖున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఇదే తారీఖున బాలకృష్ణ నటించిన అఖండ సినిమా రిలీజ్ అయింది. అఖండ బాలకృష్ణ కెరియర్ లో ఏ స్థాయి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మళ్లీ అదే సెంటిమెంట్ డేట్ ను ఈ సినిమా కూడా వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ టీజర్ సినిమా పైన విపరీతమైన అంచనాలను పెంచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు